ఓరి దేవుడోయ్..ఆ విషయంలో మెగా ఫ్యామిలీ మరీ ఓవర్ చేస్తుందే..ఇంత హంగామా అవసరమా..?

సోషల్ మీడియాలో నెగిటివిటీ అనేది కామన్ ..మంచి పని చేసిన ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మనం బాగుపడుతున్నాము అంటే మనల్ని వెనక్కి లాగేసేవాళ్ళు మన ఆనందం చూసి కుళ్ళుకొని ఏడ్చేవాళ్ళు ఎంతోమంది అది అందరికీ తెలిసిందే . అయితే రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అలా ఏడ్చి ట్రోల్ చేసే బ్యాచ్ ఎక్కువగా కనిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఎంత సంచలనంగా మారిందో మనకు తెలిసిందే. ఏపీ పొలిటికల్ హిస్టరీలోనే గేమ్ చేంజర్ గా మారి ఏపీలో కూటమి అధికారం చేపట్టే విధంగా పక్క స్ట్రాటజీతో ముందుకెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ .

ఓపక్క నరేంద్ర మోడీని మరొకపక్క చంద్రబాబునాయుడుని సమాంతరంగా బ్యాలెన్స్ చేసి వైసిపిని పకడ్బందీగా తొక్కేశాడు . వైసీపీకి అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడు . ఇది కనివిని ఎరుగని ఊహించిన దెబ్బ వైసిపికి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధించిన విజయంతో ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు . మెగా ఫ్యామిలీ అయితే ఓ రేంజ్ లో పవన్ కళ్యాణ్ ను పొగిడేస్తుంది . మరీ ముఖ్యంగా రీసెంట్గా ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేసింది . ఈ వీడియోలో అందరూ చాలా ఎమోషనల్ గా కనిపించారు .

అయితే ఈ వీడియో పై అప్పుడే ట్రోల్లింగ్ స్టార్ట్ అయింది . మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే పడని వాళ్ళు ఈ వీడియో పై నెగటివ్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు . మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ విషయంలో మరీ ఓవర్ చేస్తుంది . ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు .. చాలామంది ఎమ్మెల్యేలుగా గెలిచారు .. అందులో పెద్ద వింత ఏం ఉంది . ఫస్ట్ టైం గెలిచాడు అన్న ఆత్రుత అందరికీ ఉంటుంది . అయితే ఈ రేంజ్ లో హంగామా చేయాలా..? ఇంత ఓవర్ యాక్టింగ్ గా ..? అంటూ ఫైర్ అవుతున్నారు . అంతేకాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కూడా ఏకేస్తున్నారు. లేకలేక గెలిచాడు అన్న ఆనందమా..? ఇకపై గెలవబోడు అన్న కాన్ఫిడెంట్ నా..? అంటూ ట్రోల్ చేస్తున్నారు . చాలామంది ఎమ్మెల్యేలుగా ఫస్ట్ టైం గెలిచారు.. వాళ్ళ ఇంట్లో ఇంతటి హడావిడి లేదే కేవలం పవన్ కళ్యాణ్ కోసం మాత్రమే ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు..??