అందుకే అన్నాలెజినోవకు పవన్ కళ్యాణ్ పడిపోయాడా..? అందరి ముందే ఏం చేసిందో చూడండి (వీడియో)..!

అన్నలెజినోవా.. ఒకప్పుడు ఈ పేరు గురించి చెప్పాలి అంటే తీన్మార్ సినిమాలో హీరోయిన్ .. అంతే అంతవరకే.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడో భార్య గా ఏ విధంగా ట్రోల్ చేశారో జనాలు మనం చూసాం . అంత ఎందుకు ..?పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వచ్చాక ఆయన గురించి జనాలు ఎంత మాట్లాడుకున్నారో తెలియదు ..కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నాలెజీనోవో ఆమె ఒక రష్యన్ మన ఇండియన్ కాదు అంటూ రకరకాలుగా చెవులు కొరుక్కున్నారు .

పలువురు పొలిటీషియన్స్ ఆమెపై నానా విధాలుగా ఘాటు పదాజాలంతో దూషించారు . అవన్నీ ఓపికగా భరించిన ఆమె ఏనాడు కూడా ఎవరిపై కోప్పడిన సందర్భాల్లో లేవు .. ఫైనల్లీ అన్నా లేజీనావో తన మంచితనాన్ని బయటపెట్టుకుంది. సోషల్ మీడియాలో ప్రజెంట్ అన్నాలేజీనోవా పేరు మారుమ్రోగిపోతుంది . పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు . భర్త విజయాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది అన్నాలెజినోవా…

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు పవన్ కళ్యాణ్ కి దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన తల్లికి ..శిరస్సు వంచి నమస్కారం చేస్తాడు. ఆ టైంలో అన్నాలెజినోవో పవన్ కళ్యాణ్ చెప్పులని చేత్తో పట్టుకుంటుంది . ఇది చూసిన జనాలు షాక్ అయిపోతున్నారు . అసలు భర్త అంటే విలువ ఇవ్వని ఈరోజుల్లో నీలాంటి భార్య కూడా ఉంటుందా..? నువ్వు ఒక రష్యన్ అయినా సరే తెలుగు సాంప్రదాయాలను చక్కగా ఫాలో అవుతున్నావు.. అందుకే పవన్ కళ్యాణ్ నిన్ను ఇష్టపడినట్లు ఉన్నాడు అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . అన్నా లెజినోవా చేసిన పని ఇప్పుడు నెట్టింత బాగా హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది ..!!