అరెరె .. తెలిసి తెలిసి ..పవన్ కళ్యాణ్ అలాంటి తప్పు ఎలా చేశాడు..?

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఇండస్ట్రీలో రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం . పవర్ స్టార్ అని కాదు పవన్ కళ్యాణ్ అని కూడా కాదు .. పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటూ చాలా ఫన్నీగా చాలా ఆనందంగా పిలుస్తున్నారు పవన్ అభిమానులు. ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ కి కూడా ఆ పిలుపు కొత్తగానే అనిపిస్తుంది . కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు . ఒకటి కాదు రెండు కాదు దాదాపు 74 వేల కోట్ల మెజారిటీతో గెలుపొందారు .

దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్నారు . అంతేకాదు పవన్ కళ్యాణ్ ఏపీ పొలిటికల్ హిస్టరీలో గేమ్ చేంజర్ గా మారిపోయాడు అంటూ ప్రశంసిస్తున్నారు . ఈ క్రమంలోనే అన్న మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్గా వెల్కమ్ చేశారు . మెగా ఫ్యామిలీ లోకి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ను బాగా సత్కరించారు. పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవో ..కొడుకు అకీరా లకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు . పవన్ కళ్యాణ్ తన అమ్మగారి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు . అనంతరం పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి కాళ్లకు కూడా నమస్కరించి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు . ఈ వీడియో చాలా ఎమోషనల్ గా మారింది. అంతేనా తన వదినమ్మ సురేఖ కాళ్లకు వద్దు వద్దు అంటున్నా కూడా నిల్చోపెట్టి మరి నమస్కారం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో జనాలు ఒక తప్పును కనిపెట్టేశారు. చిరంజీవికి సురేఖ కాళ్లకు నమస్కారం చేసిన నువ్వు నాగబాబు పద్మజల కాళ్లకు ఎందుకు నమస్కారం చేయలేదు అంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!