ఒకప్పుడు తమ అందచందాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన అందాల ముద్దుగుమ్మలు ఇప్పుడు కెరియర్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు . పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో ఏదో సాధించాలి అంటూ తాపత్ర పడిపోతున్నారు . తాజాగా అదే లిస్టులోకి వచ్చింది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ . సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ అగర్వాల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా సత్యభామ. ఫుల్ టు ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . ఈ సినిమా కోసం కాజల్ చేసిన ప్రమోషన్స్ అన్ని ఇన్ని కాదు . ప్రతి షోకి ప్రతి ఈవెంట్ కి హాజరైంది . మరి ముఖ్యంగా బాలయ్య కూడా కాజల్ ని ఓ రేంజ్ లో పొగిడేసారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
ఈ సినిమాలో షీ టీం డిపార్ట్మెంట్ ఏసీపీగా పనిచేస్తూ ఉంటుంది కాజల్ అగర్వాల్ . కొందరు ఆకతాయిలో అమ్మాయిల ఫోటోలను మార్పు చేసే సోషల్ మీడియాలో పెట్టి వేధిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని అరెస్టు చేస్తూ ఉంటుంది . అంతేకాదు అమ్మాయిలకు అవగాహన కల్పిస్తూ ఉంటుంది.. ఎవరిని నమ్మాలి ఎవరి నమ్మకూడదు .. నేటి సమాజంలో ఎలా మెదులుకోవాలి అనే విషయాలపై ఆమె అవగాహన కల్పిస్తూ ఉంటుంది . హసీనా అనే అమ్మాయి సత్యభామను కలుస్తుంది . తన సమస్య చెబుతుంది . భర్త తనని టార్చర్ చేస్తున్నారు అంటూ ఏడుస్తుంది .
తన భర్త తనని ఎలా హింసిస్తున్నాడు అనే విషయాలను చెబుతుంది . ఇదే టైంలో డ్రగ్స్ తీసుకున్న అతను ఆ రాత్రి హసీనాను చంపేస్తాడు ..అసలు ఆ మర్డర్ ఎలా జరిగింది? ఎవరు చేశారు ..?ఎందు కారణంగా చేశారు..? ఆ మర్డర్ కాజల్ జీవితంలో ఎలాంటి పెను ప్రకంపనలు సృష్టించింది..? ఫైనల్లీ కాజల్ అగర్వాల్ ఆ కేసును చేదించిందా..? లేదా..? అసలు ఆ హసీనా ఎందుకు కాజల్ వద్దకే వచ్చి చెప్పింది..? అనే విషయాలు ఈ సినిమా చూసే తెలుసుకోవాలి . ఫుల్ టు ఫుల్లుగా సస్పెన్స్ ధ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను చాలా చాలా ఆకట్టుకుంటుంది.
మరి ముఖ్యంగా నేటి సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలను చాలా క్లియర్ గా చూపించారు డైరెక్టర్ .అమ్మాయిలు కచ్చితంగా ఈ సినిమా చూడాలి అని చెప్పుకొస్తున్నారు జనాలు . కాజల్ పెర్ఫార్మన్స్ టూ గుడ్ అని వేరే లెవెల్ లో ఉంది అని ఫస్ట్ ఇన్నింగ్స్ లో గ్లామర్ ట్రీట్ అందించిన కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం మంచి కధ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటుంది అని ఓ రేంజ్ లో పొగడెస్తున్నారు. చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..??