టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న శర్వానంద్ తాజాగా నటించిన సినిమా “మనమే”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటించింది . ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది. మొదటినుంచి సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు . కాగా రిలీజ్ అయిన తర్వాత కూడా అలాంటి ఓ పాజిటివ్ వైబ్ అందుకుంది .
మరీ ముఖ్యంగా ఈ సినిమా అంత ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సాగిపోతూ ఉండడం .. ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉండడం సినిమాకి హైలైట్ గా మారింది.. ఒక బాబుకి తల్లి పాత్రలో కృతశెట్టి తండ్రి పాత్రలో శర్వానంద్ నటించిన తీరు జనాలను బాగా మెస్మరైజ్ చేసింది . కృతి శెట్టి లో ఈ టాలెంట్ కూడా ఉందా..? అనే రేంజ్ లో ఆశ్చర్యపోయేలా నటన పర్ఫామెన్స్ కనబరిచింది. మరీ ముఖ్యంగా శర్వానంద్ డైలాగ్స్ హార్ట్ టచ్చింగ్ గా అనిపిస్తాయి ..
కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ లో కృతి శెట్టి ప్రాణం పెట్టిన నటించింది అనే చెప్పాలి . ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఎంజాయ్ చేసే మూవీ ..పిల్లల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం ఈ సినిమాలో బాగా ప్రప్రదంగా చూపించారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. జనాలు ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు . కొత్తదనం లేకపోయినప్పటికీ శర్వానంద్ తన ఎనర్జీతో మెప్పించారు.. కృతి శెట్టి తన అందాలతో ఇంప్రెస్ చేసింది . మరి చూద్దాం ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..??