పవన్ సక్సెస్ సెలబ్రేషన్స్ కు డుమ్మా కొట్టిన అల్లు ఫ్యామిలీ.. మరోసారి వెలుగులోకి వివాదం..?!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మెగా కుటుంబంలో చిచ్చును రాజేసినట్లయింది. ఇన్నాళ్లు కుటుంబాల్లో ఎన్ని విభేదాలు ఉన్న కుటుంబమంతా కలిసికట్టుగా కనిపించేవారు. కానీ ఏపీ ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా మెగా కుటుంబం రెండుగా చీలిపోయినట్లు అయింది. ఈ వివాదానికి ఐకాన్ స్థార్‌ ప్రధాన కారణంగా మారాడు. ఏపీ ఎన్నికల పర్యటనలో కుటుంబానికి విరుద్ధంగా ఆపోజిట్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా వెళ్లి తీవ్ర ధూమారానికి కారణమయ్యాడు అల్లు అర్జున్. అయితే బన్నీ ప్రచారం చేసిన పార్టీకి కాకుండా.. వేరే పార్టీ అధికారంలో రావడంతో పరిస్థితులన్నీ రివర్స్ అయ్యాయి.

Mega Family Celebrates Pawan Kalyan's Victory - Telugu News - IndiaGlitz.com

ఏపీ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత చిరంజీవి కుటుంబ అల్లు అర్జున్ కుటుంబాల మధ్యన వివాదం మరింతగా పెరిగిందని.. వీరిద్దరి కుటుంబాలలో తీవ్ర వివాదం చోటు చేసుకుందని సమాచారం. దీనికి ఇటీవల హైదరాబాద్ లోని చిరంజీవి ఇంట్లో పవన్ కళ్యాణ్ సక్సెస్ సెలబ్రేషన్‌సే ఉదాహరణ. ఈ వేడుకల్లో మెగా కుటుంబం అంతా అంగరంగ వైభవంగా పవన్ కళ్యాణ్ ను సత్కరించారు. అయితే అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇలా అల్లు కుటుంబానికి చెందిన వారెవరు కనిపించలేదు.

Allu Sirish: Blessing to have brothers like Allu Arjun, Allu Bobby | Bobby,  Brother, Indian star

దీంతో అల్లు కుటుంబం డుమ్మా కొట్టడం మరోసారి మెగా, అల్లు కుటుంబాల మధ్య వివాదం తెర‌పైకి వ‌చ్చింది. ఇక త్వరలోనే కొణిదల, అల్లు కుటుంబాలు అంటూ మెగా ఫ్యామిలీ రెండుగా విడిపోతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ యుద్ధం మెగా, అల్లు అభిమానుల మధ్యన కూడా తీవ్ర వివాదానికి దారితీస్తుంది. మెగా అభిమానులు పవన్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటూనే అల్లు కుటుంబాన్ని తీవ్రంగా ట్రోలింగ్స్, విమర్శలు చేస్తూ వివాదాలకు కారణం అవుతున్నారు. ఈ క్రమంలో అల్లు, కొణిద‌ల కుటుంబలు ఒక్క‌టిగా క‌నిపించి ఓ స్పష్టత ఇస్తే గాని ఈ వివాదాలకు చెక్ పడదు.