టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న దేవర సినిమా షూటింగ్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాషూట్ చివరి దశకు చేరుకుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. హై ఓల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న దేవర నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన అప్డేట్స్ ప్రేక్షకులను భారీ లెవెల్‌లో ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా నటుడు అజయ్ మాట్లాడుతూ ఈ సినిమాపై చేసిన కామెంట్స్ ప్రేక్షకుల్లో మరింత అంచనాలను పెంచేశాయి. అజయ్ మాట్లాడుతూ కథ, కథనం పరంగానే కాదు.. ఎలివేషన్స్ పరంగాను ది బెస్ట్ సినిమాగా దేవర ఉండనుందని.. ఈ ఏడాదిలో రానున్న సినిమాలు అన్నిటిలో బెస్ట్ మూవీ లో ఒకటిగా దేవర నిలిచిపోతుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అజయ్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
ఇక సినిమా షూట్ త్వరలోనే పూర్తి చేసి రిలీజ్ కు కావలసిన ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉంచాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. తారక్ ఈ సినిమాతో పాటు టాలీవుడ్ లో వార్ 2 సినిమాలను నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ మూవీపై కూడా ఇప్పటికే ప్రేక్షకుల మంచి అంచనాలను నెలకొన్నాయి. నిన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా తన సినిమాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నాడు.