రాజమౌళి తర్వాత ప్రభాస్ లాంటి సాలిడ్ కటౌట్‌ను ప్రశాంత్ నీల్ మాత్రమే పర్ఫెక్ట్ గా వాడుకున్నారు అంటూ అభిమానులు ఇటీవల వచ్చిన సలార్ సక్సెస్ తో తెగ సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు గంటల రన్ టైం తో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను భారీ లెవెల్ ఆకట్టుకుంది. దీంతో సిని లవర్స్ కోసం రిపీటెడ్ గా షోలు వేశారు మేకర్స్. స్టోరీ గందరగోళంగా అనిపించినా.. సినిమాలో ప్రభాస్ ఎలివేషన్స్ ముందు అవన్నీ డీలా పడిపోయాయి. దాదాపు ఆరేళ్ల తర్వాత సలార్ తో సెన్సేషనల్ కం బ్యాక్ ఇచ్చాడు. రూ. 800 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేశాడు డార్లింగ్.
మూవీ రిలీజ్ కంటే ముందే ఈ సినిమాపై వచ్చిన హైప్‌తో మొదటి రోజు రూ.178 కోట్ల గ్రాస్ కొటగొట్టిన ఈ సినిమా గత ఏడాది చివర్లో రిలీజై ఆ ఏడాదిలోనే అధిక కలెక్షన్ల అందుకున సినిమాగా రికార్డ్ సృష్టించాంది. రెండు రోజుల్లో రూ.500 కోట్ల క్లబ్లో చేరి సెన్సేషనల్ గా మారింది. ఇలా మొత్తంగా సినిమా రూ.850 కోట్ల గ్రాస్ ను దక్కించుకుంది. కాగా ఈ సినిమా సీక్వెల్ గా రానున్న సలార్ (శౌర్యంగ పర్వం) కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. పైగా మొదటి పార్ట్ లో స్టోరీని ఇన్‌కంప్లీట్ గా, కన్ఫ్యూజ్ చేసి వదిలేసాడు ప్రశాంత్. దీంతో సెకండ్ పార్ట్ రిలీజ్ అయితే గాని ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకదు.
ఈ క్రమంలో సలార్ సెకండ్ పార్ట్ ఈ ఏడాది ద్వితీయ అర్థం లోనే రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా హిందీ వర్షన్ ఇప్పటికే రిలీజై 16 వారాలు అవుతున్న ఓటీటీలో సంచలనంగా దూసుకుపోతుంది. సలార్ హిందీ వర్షన్ గత నాలుగు నెలలుగా హాట్స్టార్ టాప్ ప్లేస్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది సాధారణ విషయం కాదు. ఇక ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు 600 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్ సోషల్ మీడియాను షేక్ చేసేసాయి. ఇక ట్రైలర్ జోన్ 10న రిలీజ్ కానుంది. దీంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఈ సినిమా రిలీజ్ అయి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.