జాన్వి కపూర్ ..శ్రీదేవి ముద్దుల కూతురు .. ఆ స్టేటస్ తోనే ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటుంది .. ఇది కాదు అని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు .. ఎందుకంటే ఆ విషయాన్ని ఆమె కూడా ఒప్పుకుంటుంది . శ్రీదేవి కు ఉన్న స్టేటస్ తో పలుకుబడితోనే జాన్వి కపూర్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అన్న విషయం అందరికీ తెలుసు. తెలుగు ఇండస్ట్రీలో ఏకంగా ఎన్టీఆర్ సరసన డెబ్యూ ఇచ్చె ఛాన్స్ జాన్వి కపూర్ అందుకుంది ..అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ స్వర్గీయ నటి అతిలోకసుందరి శ్రీదేవి అని చెప్పక తప్పదు . శ్రీదేవి కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు జాన్వి కపూర్ ని ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలబెడుతుంది .
దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వి ఈ సినిమా రిలీజ్ కాకముందే మరొక గ్లోబల్ స్టార్ సరసన అవకాశం అందుకునింది . రాంచరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా ఇచ్చేసింది . అయితే ఇద్దరు తెలుగు బడా స్టార్స్ అదేవిధంగా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న నటుల మధ్య నటించే ఛాన్స్ వచ్చినా కూడా జాన్వి కపూర్ హ్యాపీగా లేదట .
దానికి కారణం ఈ రెండు సినిమాలలో జాన్వీ కపూర్ ట్రెడిషనల్ లుక్స్ లోనే కనిపించబోతుందట .. ఎక్కడ ట్రెండీ మోడరన్ లుక్స్ లో కనిపించదట.. ఈ జనరేషన్ లుక్స్ లో బాగా మ్యాచ్ అయ్యే జాన్వి కపూర్ ట్రెడిషనల్ లుక్స్ లో చేస్తే బాగుంటుంది కానీ తన కోరిక ప్రకారం కొంచెం కూడా మోడరన్ పద్ధతిలో కనిపించకుండా పట్టు పరికిణిలో చీర కట్టుకొని కనిపిస్తే ఏం బాగుంటుంది అన్నది ఆమె ఒపీనియన్ . అంతేకాదు దేవర లో పల్లెటూరి గెటప్ లో కనిపించబోతుందట జాన్వి కపూర్ . ఆల్రెడీ దేవరకు సంబంధించిన లుక్ రిలీజ్ అయిపోయింది . లంగా వోణీలో జాన్వీ కపూర్ లుక్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి . కానీ జాన్వికాపూర్ మాత్రం సాటిస్ఫై అవ్వడం లేదు..!!