అయ్యయ్యో పాపం..ఆ విషయంలో కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన.. ఏమైందంటే..?

ఉపాసన .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. మెగా ఇంటి కోడలుగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. అంతకు ముందు కూడా ఉపాసన స్టార్ సెలబ్రెటీనే.. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారి మనవరాలు. మెగా ఫ్యామిలీ ఇంటికి కోడలు అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి కోడలిగా .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా మరింత క్రేజీ పాపులారిటీ దక్కించుకుంది. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమె పెట్టే పోస్టులు అభిమానులకి ఎంత ఉపయోగకరంగా ఉంటాయో మనకు తెలిసిందే .

కాగా రీసెంట్గా ఉపాసన తాతగారు ప్రతాప్ రెడ్డి ట్రావెల్ చేస్తున్న కారు ప్రమాదానికి గురైంది .. చెన్నైలో ఓ వ్యాన్ ప్రతాపరెడ్డి కారు పైకి దూసుకు రావడంతో ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది . ఈ ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసు సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ..కేసు నమోదు చేసుకున్నారు . దర్యాప్తు చేపడుతున్నారు . అయితే ప్రతాప్ రెడ్డికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు.

కానీ ఉపాసన మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయిందట . మొదటి నుంచి తాతగారు అంటే చాలా ఇష్టం గౌరవం ప్రేమ ఉన్న ఉపాసన..ఒక్కసారిగా తాత గారికి ఆక్సిడెంట్ అయింది అని తెలియగానే ఉపాసన కన్నీళ్లు పెట్టుకున్నారట. అంతేకాదు స్వయంగా తన కళ్ళతో తన తాత గారిని చూసేవరకు కూడా ఆమె కూల్ అవ్వలేకపోయిందట. ప్రజెంట్ దీనికి సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది. ఉపాసన చాలా చాలా ఎమోషనల్ ..పైకి స్ట్రాంగ్ ఉమెన్ గా కనిపించిన రిలేషన్షిప్ విషయంలో చాలా చాలా కేర్ఫుల్ గా ఎమోషనల్ అంటున్నారు ఫ్రెండ్స్ .. ఎంతైనా ఆడపిల్ల కదా పెద్దింటి కోడలైన గ్లోబల్ స్టార్ భార్య అయిన ఉపాసన కి కూడా మనసు ఉంటుంది కదా అంటున్నారు అభిమానులు..!!