బన్నీ రిజెక్ట్ చేసిన స్టోరీ తో బ్లాక్ బస్టర్ కొట్టిన మాస్ మహారాజ్.. మూవీ ఏంటంటే..?!

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జరుపుతున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా కంటే ముందుగా వచ్చిన పుష్ప ఎంతటి ఘ‌నవిజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. తను నటనకు గాను అల్లు అర్జున్ ఉత్తమ న‌టుడిగా జాతీయ అవార్డు దక్కించుకుని రికార్డ్ సృష్టించాడు. ఒక సినిమాతో అల్లు అర్జున్ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. మొన్నటి వరకు టాలీవుడ్ ఐకాన్ స్టార్ గా ఉన్న బన్నీ.. ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు.

Allu Arjun Gets Emotional "I Was At Minus 100, The Success Of Arya Helped  Me Jump 200 Percent" | Times Now

ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఈ సినిమాతో రవితేజ గతంలో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ మూవీ ఏంటో..? ఒకసారి చూద్దాం. అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొద‌టి సినిమాతోనే బన్నీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత వచ్చిన ఆర్య సెన్సేషనల్ హిట్స్ అయ్యింది. ఈ మూవీకి దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో దాదాపు అన్ని పాటలు సూప‌ర్ హిట్‌గా నిలిచాయి.

Bhadra (2005) - IMDb

అయితే గంగోత్రి తర్వాత చాలా సమయం తీసుకున్న అల్లు అర్జున్.. ఎన్నో కథలను విన్న అవి నచ్చక రెజ‌క్ట్‌ చేశాడట. అప‌ట్లో బోయపాటి శ్రీను బన్నీకి భద్ర క‌థ‌ వినిపించగా.. బ‌న్ని సినిమా చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నాడ‌ట‌. అదే టైంలో సుకుమార్ ఆర్య కథ చెప్పడంతో యూత్ ని ఆకట్టుకునే కథల ఉందని ఆర్యను ఎంచుకున్నాడట బ‌న్నీ. ఇక ఇదే కథను రవితేజకు బోయపాటి వినిపించగా.. ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా వ‌చ్చి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. ఈ మూవీ రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.