“ఎవ్వరు ఏమనుకున్న ఖచ్చితంగా ఆ పని చేస్తా”.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఈ పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఎలా మారు మ్రోగిపోతుందో మనకు తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ అతి భారీ మెజారిటీతో తన అపోజిషన్ లీడర్ వంగ గీతాపై 74 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరును జనాలు బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఆయనకు సంబంధించిన వార్తలు గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్నాయి. ఏపీ పొలిటికల్ హిస్టరీలో గేమ్ చేంజర్ గా మారిపోయారు అంటూ ప్రశంసిస్తున్నారు ఏపీ జనాలు .

మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వార్తలను బాగా ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి . తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలతో మీటింగ్ నిర్వహించారు . ఆ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ..”మొదటి నుంచి కష్టపడుతున్న .. కచ్చితంగా నా వంతు కృషి చేస్తాను అంటూ చెప్పడమే కాకుండా ..నేను ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటాను అని చెప్పుకొచ్చారు “..

“నేను తీసుకునే జీతంలో ప్రతి రూపాయికి ప్రజలు నన్ను చొక్కా పట్టుకొని అడిగేలా బాధ్యత ఉంటుంది .. ఒకవేళ నేను ఏం చేయకపోయినా సరే ప్రజలు రేపు నన్ను నిలదీయొచ్చు. ఆ భయం కూడా నాకు ఉంటుంది .. అందుకే ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటాను “అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . “ప్రతి రూపాయి తీసుకునే దానికి పనిచేయాలి అంటూ అందరికీ చెప్పుకు వచ్చారు”. ప్రజల కష్టం నుంచి వచ్చిన డబ్బు మనం ఊరికే తీసుకోకూడదు.. వాళ్లకి మనం జవాబు దారిగా ఉండాలి .. అందుకే జీతం తీసుకుంటాను అంటూ చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చారు . ప్రజెంట్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల తాలూకా వీడియో వైరల్ గా మారింది..!!