రజనీకాంత్ తో ఫోటో దిగిన ఈ పాప.. ఒకప్పటి హీరోయిన్.. ఓ స్టార్ హీరో భార్య.. ఎవరో గుర్తుపట్టారా..?!

సినీ ఇండస్ట్రీలో త్రో బ్యాక్ థీంతో స్టార్ నటీనటుల ఫొటోస్ నెటింట‌ తెగ వైరల్ అవుతూన్న సంగ‌తి తెలిసిందే. ఎప్పటికప్పుడు తమ అభిమాన హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలను వైరల్ చేయడానికి అభిమానులు కూడా ఆసక్తి చూప‌తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు పిక్స్‌ తెగ వైరల్ గా మారాయి. ఇంతకీ రజినీకాంత్ తో కలిసి ఫోటోకు స్టిల్ ఇచ్చిన ఈ చిన్ని పాప ఎవరో గుర్తుపట్టారా.. ఆమె సౌత్ స్టార్ హీరో భార్య.. ఒకప్పటి స్టార్ హీరోయిన్.. పలు సినిమాలతో బ్లాక్ బ‌స్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. పెళ్లి అయిన తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఇంతకీ ఆమె ఎవరో చెప్పలేదు కదా.. ఆమె కోలీవుడ్ హీరోయిన్ షాలిని.

Happy Birthday Shalini Ajith: Fans pour wishes for the actress – India TV

స్టార్ హీరో అజిత్ భార్య. షాలిని మలయాళం లో 1997లో రిలీజ్ అయిన ఆనియతి ప్రవు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తమిళ్లో విజయ్ స‌ర‌సన కాద‌లుక్కు మరియాదై సినిమాతో పరిచయమైంది. తొలి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ అమ్మడు.. తన నెక్స్ట్ మూవీ మీరో అజిత్ తో కలిసిన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అజిత్, షాలిని కలిసి నటించిన మొదటి సినిమా అమరకలం. ఈ మూవీ 1999 ఆగస్టు 13న ఈ సినిమా రిలీజ్ అయింది. షూటింగ్ టైంలో వీరిద్దరూ ప్రేమలో పడడం.. సినిమా రిలీజ్ అయి సక్సెస్ సాధించడంతో వీరు లవ్ కూడా అదే రేంజ్‌లో సక్సెస్ సాధించింది.

When Ajith Kumar recalled his love story: 'I cut Shalini's wrist by  accident, it started there' | Tamil News - The Indian Express

తర్వాత 2000 సంవత్సరంలో వచ్చిన సఖి సినిమాతో ఈ జంట మరింతగా పాపులర్ అయ్యారు. సినీ రంగంలో టాప్ హీరోయిన్గా వెలుగొందుతున్న టైంలో షాలిని, అజిత్ వివాహం చేసుకుంది. 2001లో రిలీజ్ అయిన ప్రియద వ‌రం వేండుమ్‌ తర్వాత ఆమె ఇండస్ట్రీకి గుడ్ బై చెప్సి హౌస్ వైఫ్ కా సెటిల్ అయిపోయింది. మొదట బాలనటిగా సౌత్ ఇండస్ట్రీలో రాణించిన షాలిని తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. తమిళ్లో కేవలం నటించింది 5 సినిమాలే అయినా స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లోనే ఈ అమ్మడు సినిమాకు రూ.50 లక్షల రెమ్యునరేషన్ తీసుకునేదట. ఇక అజిత్, షాలినిల నికర ఆస్తుల విలువ రూ.300 కోట్లకు పైచిలుకే అని తెలుస్తుంది. తక్కువ సినిమాలతోని తిరుగులేని క్రేజ్‌సంపాదించుకున్న ఈ అమ్మడి చిన్ననాటి ఫొటోస్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది.