నాకు అలాంటి మసాజ్ కావాలంటున్న అనుపమ.. లేటెస్ట్ పోస్ట్ వైరల్..?!

మలయాళ సోయగం అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో మంచి పాపులారిటీ ద‌క్కించుకున్న‌ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న ఈ అమ్మడు ఇటీవల సిద్దు జొన్నలగడ్డతో కలిసి టిల్లు స్క్వేర్ సినిమాలో నటించి హిట్ అందుకుంది. ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ రాబట్టిన ఈ సినిమాలో లిల్లీ పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. బోల్డ్ అందాలతో ఆకట్టుకున్న అనుపమ ఈ సినిమా రిలీజ్‌కు ముందు ప‌లు ట్రోల్స్ ఎదుర్కొన్న మూవీ రిలీజ్ అయిన తర్వాత విమర్శకుల ప్రశంస‌లు దక్కించుకుంది.

ముఖ్యంగా ఎప్పటికప్పుడు హోమ్లీ పాత్రలో నటించే ఈ అమ్మడు ఒక్కసారిగా టిల్లు స్క్వేర్ లో గ్రామర్ వల్లకబోస్తూ షాక్ ఇచ్చింది. దీనితో ఆమెలోని మరో కొత్త టాలెంట్‌ను చూసి షాక్ అయ్యారు అభిమానులు. దీంతోపాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. తన లేటెస్ట్ గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేసుకుంటూ అభిమానులకు మరింత దగ్గరవుతుంది. తాజాగా అనుపమ షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. తనకు నడుము నొప్పిగా అనిపిస్తోందని వివరిస్తూ.. అందుకు ఏదైనా చికిత్స ఉంటే బాగుంటుందని.. రోడ్ రోలర్ తో మసాజ్ అయితే బెటర్ అనేలా అర్థం వచ్చేలా ఓ ఫోటోతో పోస్ట్ ని షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ ట్విట్ నెటింట వైరల్ గా మారడంతో దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇక సినిమాల విషయానికి వస్తే టిల్లు స్క్వేర్ తో గ్లామర్ ని పెంచిన అమ్మడు.. ప్రస్తుతం పరదా టైటిల్ తో లేడీ ఓరియంటల్ సినిమాలో నటిస్తుంది. ఎప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన అనుపమ ఫస్ట్ లుక్ పోస్ట్ర్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించనున్నారట మేకర్స్.