ఆ హీరో కోసం సంచలన నిర్ణయం తీసుకున్న రానా.. ఏ స్టార్ చేయకూడని పని చేస్తున్నాడే..!?

రానా దగ్గుబాటి .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రానా దగ్గుబాటి .. లీడర్ సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. చాలా సైలెంట్ పర్సన్.. సైలెంట్ యాక్టింగ్ అనుకున్నారు జనాలు.. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత నటించిన సినిమాలలో రానా ఒరిజినల్ క్యారెక్టర్ ను బయటకు తీశాడు. కేవలం హీరో గానే కాదు విలన్ గా కూడా పలు సినిమాల్లో నటించి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు రానా దగ్గుబాటి .

డాక్టర్ డి రామానాయుడు గారి మనవడిగా ప్రొడ్యూసర్ సురేష్ బాబు కొడుకుగా ఇండస్ట్రీలో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. కాగా రీసెంట్ గా రానాకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . రానా దగ్గుబాటి ఓ స్టార్ హీరో కోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . హీరో నవదీప్ తాజాగా నటించిన సినిమా లవ్ మౌళి . ఈ సినిమాలో రానా దగ్గుబాటి అఘోరా క్యారెక్టర్ లో కనిపించారట .

ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది . జనరల్ గా అఘోర క్యారెక్టర్లు యంగ్ హీరోస్ చూస్ చేసుకోరు. అది కూడా బడాస్టార్ అస్సలు చూస్తూ చేసుకోరు. కానీ రానా దగ్గుబాటి నవదీప్ లాంటి హీరో కోసం ఆయన సినిమాలో అఘోర క్యారెక్టర్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది . దీంతో ఈ న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. అసలు ఎందుకు రానా దగ్గుబాటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు ..? నవదీప్ తో ఉన్న ఫ్రెండ్షిప్ కారణమా..? లేకపోతే ఆయనకు అవకాశాలు రావడం లేదు అన్న ఫ్రస్టేషన్ నా..ఏమో అంటూ ఫ్యాన్స్ కూడా అసహనంగా కామెంట్స్ చేస్తున్నారు..!!