సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మహేష్ బాబు ..రాజమౌళి పేర్లు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. వీళ్ళకు సంబంధించిన సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు .. పూజా కార్యక్రమాలు జరుపుకోలేదు..కానీ సంచలన రికార్డ్స్ క్రియేట్ చేయబోతున్నాడు మహేష్ రాజమౌళి సినిమా అంటూ తెగ ప్రచారం జరుగుతుంది . కాగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ అలాగే ముగ్గురు బడా విలన్స్ ఉండబోతున్నారట . ఈ సినిమా కోసం మహేష్ బాబు డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ కూడా చేయబోతున్నారట.
కాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . నవదీప్ హీరోగా లవ్ మౌళి అనే సినిమాతో రాబోతున్నాడు డైరెక్టర్ అవనీంద్ర . ఈ సినిమాతోనే ఆయన డైరెక్టర్గా పరిచయం కాబోతున్నాడు .అయితే అవనీంద్ర చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాడు . విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి టీం లో అసోసియేట్ రైటర్ గా వర్క్ చేసాడు. బాహుబలి కంటే ముందు నుంచే వీళ్లతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు . నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా అవనీంద్ర రచయితగా వర్క్ చేశారు .
లవ్ మౌలి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అవనీంద్ర రాజమౌళి మహేష్ బాబు సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “రాజమౌళి గారు నెక్స్ట్ మహేష్ బాబుతో చేస్తున్నారు అని మాకు తెలుసు ..ఆ రోజు టీమ్ అంతా కూర్చుని మహేష్ తో ఎలాంటి మూవీ చేయాలి అని రాజమౌళి అడిగారు.. ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్పారు ..కౌబాయ్ అంటూ ఒకరు జేమ్స్ బాండ్ అంటూ మరొకరు.. చాలా సజెషన్స్ ఇచ్చారు… నేను ఏ సమాధానం చెప్పకపోతే నన్ను పిలిచి మరీ అడిగారు ..అప్పుడే చెప్పాను జేమ్స్ బాండ్ హాలీవుడ్ సినిమాలో చూసాము .. ఆల్ రెడీ మహేశ్ ని కౌ బాయ్ గా చూశాము..మీ మూవీ కొత్తగా అయితే బాగుంటుంది ..అడ్వెంచర్స్ అయితే ఇంకా బాగుంటుంది అని సజెస్ట్ చేశాను ..దానికి రాజమౌళి గారు ఓకే చెప్పారు” అంటూ అవనీంద్ర సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టాడు..!!