తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల్లో ఎన్‌డిఏ కూటమి విజయభేరీ మోగించిన సంగతి తెలిసిందే. ఇక ఏపీ పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపి భారీ మెజారిటీతో విజయాని అందుకున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే పోటీ చేసిన 21 ఎమ్మెల్యే , 2 ఎంపీ స్టేట్లను 100 శాతంగెలవటమే కాదు.. భారీ మెజారిటీతో విజయాన్ని సాధించారు. ఈ క్రమంలో ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ భార్య అన్న లేజినోవా, కొడుకు ఆకిరా నందన్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లి సందడి చేశాడు. ఇందులో కొడుకు ఆకీరను ప్రధానమంత్రి మోడీకి పరిచయం చేశాడు పవర్ స్టార్.
ప్రస్తుతం పవర్ స్టార్ ఆకీరా నందన్‌ను మోడీకి పరిచయం చేస్తున్న ఫొటోస్ నటింట వైరల్ గా మారాయి. ఇందులో మోదీ ఆకిరా నందన్ భుజంపై చేయి వేసి మాట్లాడుతున్న ఫోటో ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతుంది. ఇది చూసిన పవన్ అభిమానులంతా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. యువసేనని సిద్ధంగా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పవన్ త్వరలోనే రాజకీయాల్లో బిజీకాన్నారు.. ఈ క్రమంలో ఆయన సైన్ చేసిన సినిమాల షూటింగ్ ఎప్పటికీ పూర్తవుతుందని సందేహాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ హరి హర హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలకు కమిటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్స్ అన్ని మధ్యలోనే ఆగిపోయాయి. ఎలక్షన్స్ తరువాత పవన్ కళ్యాణ్ వరుసగా ఈ సినిమాల షూటింగ్‌లని పూర్తి చేసి వరుసగా మూడు సినిమాలను రిలీజ్ చేసేలా డేట్స్ కేటాయించనున్నారని టాక్. ఇక రాజకీయాల్లో బిజీ అయిన పవన్.. సినిమాలను, రాజకీయాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారో వేచి చూడాలి.