ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. ఫస్ట్ రీ రిలీజ్ కాబోతున్న పవన్ సినిమా ఇదే..ఆయనకు ఎంత స్పెషల్ అంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..కాదు కాదు పిఠాపురం ఎమ్మెల్యే గారు.. ఎస్ ప్రెసెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ అనడం కన్నా కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారు అని పిలవడానికి ఫ్యాన్స్ మెగా కుటుంబం ఆయన ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు . కొందరు సరదాగా ఆటపట్టిస్తుంటే మరికొందరు మాత్రం నిజమే కదా పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటూ మళ్ళీ తిరిగి రివర్స్ గా పవన్ కళ్యాణ్ కి ఆన్సర్ ఇస్తున్నారు. పవర్ స్టార్ అయినా ..పవన్ కళ్యాణ్ అయిన ..పిఠాపురం ఎమ్మెల్యే అయిన ఎవరైనా సరే ప్రజాసేవకే ఇంట్రెస్ట్ చూపిస్తాను. ప్రజలకు సేవ చేయడానికి ఈ జీవితాన్ని అంకితం చేస్తాను అంటూ చెప్పుకొస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫస్ట్ రీ రిలీజ్ కాబోతున్న సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు కొన్ని హిట్ అయ్యాయి కొన్ని ప్లాప్ అయ్యాయి . అయితే పవన్ కళ్యాణ్ తలరాతను మార్చేసిన సినిమా మాత్రం తమ్ముడు అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ ఎలా పెరిగిపోయిందో కూడా అందరికీ తెలుసు .

ఇప్పటికీ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో ది మోస్ట్ ఫేవరెట్ మూవీ ఏంటి అంటే 100% లో 90% జనాలు చెప్పే సినిమా పేరు తమ్ముడు . ఈ సినిమా రీ రీలీజ్ కాబోతుంది. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ కి స్పెషల్ విషెస్ అందజేస్తూ తమ్ముడు సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు అవుతున్న శుభసందర్భంగా అదే డేట్ కి మళ్ళీ తమ్ముడు సినిమాను రిలీజ్ చేయబోతున్నారు మూవీ టీం . తమ్ముడు సినిమా జూలై 15 1999లో రిలీజ్ అయింది . జూలై 15 సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్లు పూర్తవుతుంది. మళ్లీ అదే తేదీనా రీ రిలీజ్ చేయబోతున్నారట మేకర్స్ . దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!