హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటి దక్కించుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సూపర్ హీరో కాన్సెప్ట్ తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొంది.. బాక్స్ ఆఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళను కొల్లగొట్టి.. బిగ్గెస్ట్ హీట్గా రికార్డ్ సృష్టించింది. దాంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు పాన్ ఇండియా లెవెల్లో మారుమోగిపోయింది.
ప్రస్తుతం ప్రశాంత్ వర్మతో సినిమాలు చేసేందుకు పెద్ద పెద్ద హీరోలు, నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక త్వరలోనే ప్రశాంత్ వర్మ బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్న ప్రశాంత్.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. ఫుల్ టైం జాబ్ రోల్ ను ప్రకటించాడు.
Looking for poster designers. Full time job. Please reach out.. [email protected]
— Prasanth Varma (@PrasanthVarma) June 6, 2024
తమ టీం తో కలిసి పని చేసేందుకు పోస్టర్ డిజైనర్ కావాలంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటనను రిలీజ్ చేశాడు. పోస్టర్ డిజైనర్ గురించి చూస్తున్నాం.. ఇది ఓ ఫుల్ టైం జాబ్.. ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ కండి అంటూ ఓ మొయిల్ ఐడిని తన ట్విటర్ వేదికగా షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవడంతో నెటిజన్స్ నుంచి ప్రశాంత్ వర్మ కు క్రేజీ రెస్పాన్స్ అందుతుంది. మరి ఈ అవకాశాన్ని ఎవరు అందుకుంటారో వేచి చూడాలి.