తారక్ రిప్లైకి ..ఆ ఒక్క పదం వాడి..నందమూరి అభిమానులకి కొత్త డౌట్లు క్రియేట్ చేసిన చంద్ర బాబు..!!

సోషల్ మీడియాలో ప్రతి విషయం కూడా భూతద్దంలో పెట్టి చూడడం కామన్ గా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఏపీ రాజకీయాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని బాగా ట్రెండ్ చేశారు జనాలు. అదేవిధంగా ట్రోల్ చేశారు . ఫైనల్లీ ఏపీలో భారీ విజయంతో కూటమి అధికారం చేపట్టబోతుంది .. మరి కొద్ది రోజుల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు. దీనికి ప్రత్యేక పరోక్షక కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . ఏపీ రాజకీయాలలో గేమ్ చేంజర్ గా మారిపోయాడు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలోని స్టార్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నాయుడుకు స్పెషల్ విషెస్ అందిస్తున్నారు.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం గెలిచిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ట్యాగ్ చేస్తూ స్పెషల్ విషెస్ అందించారు. అయితే ఇదే క్రమంలో నారా లోకేష్ కి ..శ్రీ భరత్ కి ..పురందేశ్వరి కి ..పవన్ కళ్యాణ్ కి.. బాలకృష్ణకి చంద్రబాబు నాయుడుకి అందరికీ విష్ చేశారు . ఇప్పుడు ఒక్కొక్కరు.. ఒక్కొక్కరు జూనియర్ ఎన్టీఆర్కి రిప్లై ఇస్తున్నారు . తాజాగా చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ కు రిప్లై ఇచ్చాడు. ” థాంక్యూ వెరీ మచ్ అమ్మ ” అంటూ రిప్లై ఇచ్చారు . నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ఈసారి టిడిపికి సపోర్ట్ చేయలేదు. అలా అని ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు.

మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళినప్పుడు కూడా ఎన్టీఆర్ ఏ విధంగా స్పందించలేదు. అప్పట్లో టిడిపి శ్రేణులు ఆయనను బాగా ట్రోల్ చేశారు . అయినా సరే చంద్రబాబు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుని వెళ్లిపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ విష్ చేయడంతో అదే విధంగా చాలా కూల్ గా రిప్లై ఇచ్చారు . కానీ ఆయన థాంక్యూ వెరీ మచ్ అమ్మ అనే వర్డ్ యూస్ చేయడం అభిమానులకి చాలా చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది . అమ్మ అనడం ఏంటి అనే విషయం ఇప్పుడు చర్చించుకుంటున్నారు . పాజిటివ్ రిప్లై ఇచ్చిన ఇంత రాద్ధాంతాలా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు . మొత్తానికి మళ్లీ ఎన్టీఆర్ టిడిపికి దగ్గర అయ్యే పనిలో ఉన్నాడు అంటూ పలువురు జనాలు మాట్లాడుకుంటున్నారు..!!