అలియా భట్ కి ఆ తెలుగు హీరో అంటే అంత ఇష్టమా? ఏకంగా ఇంట్లో ఫోటో కూడా పెట్టేసుకుందా..?

అలియాభట్ ..బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ బ్యూటీ .అలియాభట్ ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ..పర్ఫెక్ట్ ఫిగర్ అనే చెప్పాలి .. అంతేకాదు సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటుంది . తనదైన స్టైల్ లో దూసుకుపోతూ ఉంటుంది . మరీ ముఖ్యంగా తన లైఫ్ని ఎలా తనకు నచ్చినట్లుగా గడపాలి అనుకుంటుందో అదే విధంగా గడుపుతుంది . అంతేకాదు అలియాభట్ గురించి తాజాగా ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.

అలియాభట్ తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించింది . అయితే ఆమె పేరుకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. కారణం సినిమాలో చిన్న క్యారెక్టర్ కావడం . కాగా అలియా భట్ కి తెలుగు ఇండస్ట్రీలో ఒక స్టార్ అంటే మహా మహా ఇష్టమట . ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి . ఎస్ మెగాస్టార్ చిరంజీవి అంటే అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఉంటారు . ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన హీరో మెగాస్టార్ చిరంజీవి నటనకు ఆలియా భట్ ఎప్పుడు ఫిదా అవుతూనే ఉంటుందట .

అంతేకాదు చిన్నతనంలో ఆమె తన బుక్స్ లో మెగాస్టార్ చిరంజీవి ఫొటోస్ పేపర్లో వస్తే కట్ చేసుకుని దాచుకునేదట . ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి ఫొటోస్ పోస్టర్స్ ఆమె తన ఇంట్లో పెట్టుకుని ఉందట . దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ప్రజెంట్ పలు బడా ప్రాజెక్ట్స్ లో బిజీ బిజీగా ఉంది అలియా భట్ . రన్బీర్ కపూర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అలియాభట్.. ఒక్కొక్క సినిమాకి 5 కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుంది..!!