రేవ్ పార్టీ కేసులో ఊహించని ట్వీస్ట్..నటి హేమ అరెస్ట్..బయట పడ్డ సంచలన నిజం..!

భారీ భారీ ట్వీస్ట్ లతో బెంగళూరు రేవ్ పార్టీ కేసు ఊహించిన మలుపు తిరిగింది. బెంగళూరు రేవ్ పార్టీ ఇష్యూ ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిందో మనందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే నటి హేమ పేరు ఈ బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో సంచలనంగా మారింది . కాగా సిసిబి పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు . నటి హేమను రేపు సిసిబి పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీకి టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరైనట్లు పోలీసుల విచారణలో బయటపడింది . అందులో నటి హేమ కూడా ఉన్నట్లు పోలీసులు కనిపెట్టారు. 150 మంది పైగా ఈ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు మొత్తంగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది . వాళ్లలో నటి హేమ కూడా ఉండడం గమనార్హం. అయితే విచారణకు హాజరు కావాలని రెండు సార్లు నోటీసులు పంపిన వివిధ కారణాలతో ఆమె దర్యాప్తుకు హాజరు అవ్వలేదు .

ఈ క్రమంలోనే మూడోసారి నోటీసులు ఇవ్వగా సమన్లకు ఆమె పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే హేమను విచారించిన పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలను కనుగొన్నారు పోలీసులు. ఈ క్రమంలోనే ఆమె రేవ్ పార్టీకి వెళ్లింది అని అక్కడ డ్రగ్స్ తీసుకుంది అని ఆ కారణంగా అరెస్టు చేశారు. రేపు హేమను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం అందుతుంది..!!