తల్లితో కలిసి క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..?!

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ అవుతూనే ఉంటాయి. ఆ ఫోటోలో ఉన్న తమ అభిమాన హీరోయిన్ ను చూసేందుకు ప్రేక్షకులు కూడా మరింత ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ పిక్ నెటింట‌ వైరల్ గా మారింది. ఇంతకీ అమ్మ ఒడిలో క్యూట్ స్మైల్తో ఆకట్టుకుంటున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోయిన్.. నార్త్ లోను దూసుకుపోతుంది.

Where's Priya Mani going this weekend? | Kannada Movie News - Times of India

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటించిన ఈ చిన్నది.. ప్రస్తుతం హిందీలో అడుగుపెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ అమ్మడుకు ఉత్తమ నటి నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇంతకీ ఈమె ఎవరో గెస్ చేసారా.. ఆమె మరెవరో కాదు ప్రియమణి. ప్రియమణి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎవరే అతగాడు మూవీ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తర్వాత వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోయింది. ఇక 2006లో ఈమె నటించిన ప‌రుత్తివీరన్ సినిమాకు నేషనల్ అవార్డు దక్కించుకొని భారీ క్రేజ్ ను సంపాదించుకుంది.

Priyamani - Wikipedia

మరొ ప‌క్క‌ రావణ్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా జవాన్ తో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకొని మరింత క్రేజీని దక్కించుకుంది. ఇప్పుడు ఈ చిన్నది వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది. తను ఎంచుకునే సినిమాలు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. పలు టీవీ షోలలోను సందడి చేసే ప్రియ‌మ‌ణి సోషల్ మీడియాలోను యాక్టివ్గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.