జూనియర్ ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యామిలీ ఎప్పుడు దూరం పెడుతుంది అని .. మరీ ముఖ్యంగా బాలకృష్ణ అస్సలు జూనియర్ ఎన్టీఆర్కి గౌరవం ఇవ్వడు.. విలువ ఇవ్వడు అని అంతా అనుకుంటూ ఉంటారు . అది ఎంతవరకు నిజమో ఆ దేవుడికే తెలియాలి. పలు సందర్భాలలో అది నిజం అని చెప్పే విధంగా కొన్ని సిచువేషన్స్ సంఘటనలు కనిపించిన .. ఆ తర్వాత ఎంతోమంది మాత్రం అలాంటిది ఏదీ లేదు అని నందమూరి ఫ్యామిలీ ఎప్పటికీ ఒకటేనని చెప్పుకు వస్తూ ఉంటారు . తాజాగా నారా చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం గా గెలిపొందారు.
బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి గెలుపొందారు ..అదే విధంగా బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్ళు కూడా పోటీ చేసి ఎన్నికల్లో భారీ విజయంతో భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్ లో ట్విట్ చేసి అందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా జూనియర్ ఎన్టీఆర్కు ఒక్కొక్కరుగా రిప్లై ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ ట్విట్టర్ అకౌంట్ నుంచి రిప్లై ఇచ్చారు .
“థాంక్యూ సో మచ్ అన్న” అంటూ రిప్లై ఇచ్చారు . నిజానికి శ్రీ భరత్ కు తారక్ బావ అవుతాడు . అయితే బావా అని కాకుండా అన్నా అని మెన్షన్ చేయడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . ఫైనల్లీ రిప్లై ఇచ్చింది శ్రీ భరత్ కాదు శ్రీ భరత్ ట్వీట్టర్ ని హ్యాండిల్ చేసే ఆయన భార్య తేజస్విని అంటూ తేలిపోయింది. దీంతో తేజస్వినికి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత గౌరవం .. ఎంత ప్రేమ ..అన్నా అంటూ ఎంత ఆప్యాయంగా పిలిచిందో అంటూ నందమూరి ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!