ఫైనల్లీ నారా చంద్రబాబునాయుడు గారు అనుకున్నది సాధించారు. అది పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో నా ..? నరేంద్ర మోడీ సపోర్ట్ తో నా..? అన్న విషయం పక్కనపెడితే వైసీపీని దారుణంగా ఓడిస్తాను అంటూ అసెంబ్లీలో శపధం చేశారు అన్న విధంగానే వైసిపికి అడ్రస్ లేకుండా చేశారు . అంతేకాదు 12వ తేదీ ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉండటం గమనార్హం.
కాగా ఇలాంటి క్రమంలోనే ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చబోతున్నాడు చంద్రబాబు అనే విషయంపై సర్వత్ర ఉత్కంఠత నెలకొంది . అయితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి చేయగానే మొదట మూడు కీలక అంశాలపై తన తొలి సంతకాలు చేయబోతున్నారట. వీటిపై గతంలో కూడా హామీ ఇచ్చారు వాటిని నెరవేర్చే విధంగా చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారట. వీటిలో మొదటిది డిఎస్సి నోటిఫికేషన్.. వైసిపి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావిడి హడావిడిగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది.
ఆ తర్వాత టెట్ డీఎస్సీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించాలని ప్రయత్నించింది కానీ కుదరలేదు . కాగా సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేయగానే డీఎస్సీ నోటిఫికేషన్ పై సంతకం చేయబోతున్నారట . రెండవ సంతకం భూ హక్కు చట్టం రద్దు మీద సంతకం చేయబోతున్నాడట . ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జరిగినంత రచ్చ మరో అంశంపై జరగలేదు. మూడో సంతకం పెన్షన్ల పై ఉండబోతుంది అంటూ సమాచారం అందుతుంది..!!