ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాని షేక్ చేసి చేస్తున్న బన్నీ భార్య.. ఐకాన్ స్టార్ వైఫ్ అంటే ఇదే..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బన్నీ పేరు ఎలా ట్రోలింగ్ కి గురవుతుందో మనం చూస్తున్నాం జనాలు . అది ఎందుకో కూడా మనకు తెలిసిందే.. తన మామయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేసి ఆ తర్వాత వైసిపి క్యాండిడేట్ కోసం ప్రచారం చేయడానికి ఏకంగా నంద్యాల వెళ్ళాడు బన్నీ . ఈ విషయంలో ఆయన ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది కూడా ఫాన్స్ కి అర్థం కాలేదు. సొంత మామయ్య రాజకీయాలలో పోటీ చేస్తున్నప్పుడు ఆ పార్టీకి అపోజిషన్ పార్టీగా ఉన్న వ్యక్తికి ఎలా బన్నీ సపోర్ట్ చేశాడు ..? అన్నది చాలా చాలా హైలెట్ గా మారింది.

బన్నీ కావాలనే మెగా ఫ్యామిలీని దూరం పెడుతున్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారానికి ఆజ్యం పోస్తూ బన్నీ వైసిపి కాండిడేట్ కు సపోర్ట్ చేయడం సంచలనంగా మారింది. ఫైనల్లీ ఇప్పుడు బన్నీ పేరు ఎలా ట్రోల్ అవుతుందో కూడా మనం చూస్తున్నాం . అయితే బన్నీ పేరు సోషల్ మీడియాలో ఎలా ట్రోల్ అయిన బన్నీ భార్య స్నేహ రెడ్డి వీడియో మాత్రం జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది .

మరీ ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన వీడియోస్ బాగా పోస్ట్ చేస్తూ ఉంటుంది . బన్నీ భార్య తాజాగా తన కూతురు అల్లు అర్హతో కలిసి అల్లరి చేసి సందడి చేసింది . దానికి సంబంధించిన వీడియో ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది . అల్లు అర్హలాగే బబుల్ గమ్ ని తింటూ నవ్వుతూ చాలా జోవియల్ గా ఫన్నీగా ఆడుకునింది .. దీనితో బన్నీ భార్య పోస్ట్ చేసిన వీడియో నెట్టింట హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఐకాన్ స్టార్ భార్య అంటే ఆ మాత్రం ఉండాలి అంటూ బన్నీ ఫాన్స్ ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు. మరొక పక్క సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని మెగా ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)