సెట్స్ లో ఆ నొప్పి భరించలేక సినిమానే వదిలేద్దాం అనుకున్నా.. జాన్వి కపూర్ షాకింగ్ కామెంట్స్..?!

స్టార్ బ్యూటీ జాన్వి కపూర్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా ప్రేక్షకులకు కనిపించకపోయినా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్ స‌ర‌సన దేవర సినిమాతో పాటు.. రామ్ చరణ్ బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో మరో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కథల ఎంపిక విషయంలో ఎప్పటికప్పుడు తన ప్రత్యేకత చాటే జాన్వి ప్రస్తుతం బాలీవుడ్‌, టాలీవుడ్ అని తేడా లేకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతుంది. ఇటీవల ఈ అమ్మడు మిస్టర్ అండ్ మిసెస్ మాహితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Mr. & Mrs. Mahi (2024) - IMDb

ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వి.. ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఈమె మాట్లాడుతూ ఇప్పటి వరకు భిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించా.. అయితే ఇప్పటివరకు చూసిన సినిమాలకంటే ఈ సినిమాలో మీరు మరో కొత్త జాన్వీని చూస్తారు. ఈ రోల్‌ కోసం మానసికంగా, శారీరకంగా ఎంతో కష్టపడ్డా. ఎప్పటికప్పుడు నేను నటించిన పాత్రలన్నింటిలో బెస్ట్ గా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటా. ఇందులో మహిమ పాత్రలో రెండింతలు ఉత్సాహంతో పని చేశా అంటూ వివ‌రించింది.

Janhvi Kapoor: “I can’t sleep till I hear the word ‘action’ now & I tell  myself…”| Mili

అయితే ఇంతకుముందు నటించిన ఏ పాత్రలను నేను ప్రత్యేక శిక్షణ తీసుకొని నటించలేదు.. అయితే ఈ సినిమా కోసం మాత్రం ప్రత్యేక క్రికెట్ ట్రైనింగ్ తీసుకున్నా. ఈ క్రమంలో నా కోచ్ నాకు క్రికెట్ పై ప్రేమను పెంచేశారు. ఇక ఈ సినిమాలో క్రికెట్‌కు సంబంధించిన సీన్స్ షూట్ చేసే సమయంలో ఎన్నోసార్లు గాయాలయ్యాయి. ఆ నొప్పిని భరించలేక కొన్ని సార్లు సినిమా నుంచి తప్పుకోవాలనుకున్నా అంటూ జాన్వి కపూర్ చెప్పుకొచ్చింది. కానీ తర్వాత మనసు మార్చుకుని ఎన్నోసమ‌స్య‌ల‌ను అధిగమించి ప్రతి సీన్ సహజంగా వచ్చేలా కష్టపడ్డా అంటూ వివరించింది. ప్రస్తుతం జాన్వి కపూర్ ఈ సినిమాలో తన ఎక్స్పీరియన్స్ పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.