సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ నటినటులుగా ఎదగాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. అలాంటి క్రమంలో సినిమా కోసం ప్రాణం పెట్టి మరి పని చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో ఈ విషయం నిరూపించబడింది. ఒక సినిమా అద్భుతంగా రావాలంటే దానిలో పనిచేసే ప్రతి నటుడు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇక కొంతమంది సెలబ్రిటీ సినిమాలోని ఏదైనా ఒక సన్నివేశం బాగా రావాలంటే ఫుడ్ తినడం కూడా మానేసి మరి ఆ సన్నివేశాన్ని పండించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు టాలీవుడ్ లో అలా చాలామంది సెలబ్రిటీస్ కొన్ని పర్టికులర్ సీన్‌ల కోసం మొఖం పీకుపోయినట్లు, డల్ అయిపోయినట్లు ఉండడం కోసం రోజంతా ఉపవాసం చేసి మరి సన్నివేశాల్లో నటించిన సమయాలు కూడా ఉన్నాయి. మరి ఆ సీన్స్ ఏంటి.. ఆ సెలబ్రిటీస్ ఎవరు ఒకసారి చూద్దాం.
సాయి పల్లవి :
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, రానా దగ్గుపాటితో విరాటపర్వం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక్క సీన్లో మొహం పీకపోయినట్లుగా ఈ అమ్మడు కనిపించాలని డైరెక్టర్ చెప్పడంతో.. ఆ రోజంతా తిండి మానేసి మరీ తెల్లవారి ఆ సీన్ చేసి 100% సీన్ వర్కౌట్ అయ్యేలా చేసింది సాయి పల్లవి.
ఆనంద్ దేవరకొండ :
విజయ్ దేవరకొండ తమ్ముడు గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బేబీ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకొని స్టార్ సెలబ్రిటీ గా క్రేజ్ సంపాదించుకున్నాడు ఆనంద్. ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ యూత్ ను నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకుంది. ఈ సీన్ అద్భుతంగా పండాలని ఓ రోజంతా తిండి తినడం మానేసి మరి ఆనంద్ దేవరకొండ నటించాడట.
రకుల్ ప్రీత్ సింగ్ :
ఈ అమ్మడు మొదటి నుంచి ఫిట్నెస్ ఫ్రీక్ అన్న సంగతి టాలీవుడ్ ప్రేక్షకులకు తెలుసు. ఇక రకుల్, చరణ్ తో కలిసి నటించిన ధ్రువ సినిమాలో పరేషాను రా పాట కోసం నడుము ఎక్స్పోజ్ చేయాల్సి ఉండడంతో ఏమాత్రం అందంగా, హాట్ గా కనిపించకపోయిన సాంగ్ ఫ్లాప్ అవుతుందనే ఉద్దేశంతో నాలుగు రోజులు పాటు అన్నం తినకుండా తన బాడీని పర్ఫెక్ట్ షేప్‌లో ఉంచే ప్రయత్నం చేసి సక్సెస్ అందుకుంది.
అల్లరి నరేష్ :
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ గతంలో లడ్డు బాబు సినిమా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మేకోవర్‌కే 6,7 గంటల వరకు పట్టేదట. ఆ సమయంలో ఆకలి వేసిన ఫుడ్ తీసుకోవడానికి వీలు లేకపోవడంతో షూటింగ్ సమయం అంతా అల్లరి నరేష్ సరిగ్గా ఫుడ్ తీసుకోకుండానే టైం స్పెండ్ చేశారట. అయితే ఆ సినిమా లో అల్లరి నరేష్ నటన అద్భుతంగా ఉన్నప్పటికీ.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.