ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన జెనీలియాకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈమె నటించిన బొమ్మరిల్లు సినిమాలో హాసిని పాత్రలో నటించి మెప్పించిన ఈ చిన్నది.. తన క్యూట్ క్యూట్ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా 2012లో నా ఇష్టం సినిమా తర్వాత తెలుగులో ఎటువంటి సినిమాల్లోనూ జెనీలియా నటించలేదు. బాలీవుడ్ నటుడు నితీష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి వివాహం చేసుకున్న ఈ అమ్మడు కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా సరే ఇప్పటికి జెనీలియాలో ఆ క్యూట్నెస్, చిన్నపిల్ల అల్లరితనం మాత్రం ఇంకా పోలేదు. తన భర్తతో కలిసి ఆమె చేసే ఇన్‌స్టా రీల్స్ చూస్తుంటే ఇది క్లియర్ గా అర్థమవుతుంది.
నితీష్, జెనీలియా కలిసి చేసే రీల్స్ ని ఇప్పటికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు. ఇక తాజాగా ఈ అమ్మడు భర్తతో కలిసి సొంతంగా సినీ నిర్మాణం కూడా స్టార్ట్ చేసింది. తన భర్త నితీష్ తో కలిసి మరాఠీలో వేద్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మజిలీకి రీమేక్ గా వచ్చిన ఈ వేద్ సినిమా బాలీవుడ్ లోనూ భారీ సక్సెస్ అందుకుంది. ప్రేక్షకుల ప్రశంసలు అందాయి. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే జెనీలియా ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన ఇప్పటివరకు ఒక్క టాలీవుడ్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మంచి పాత్ర దొరికితే తెలుగులో నటించిన అమ్మడు సిద్ధంగా ఉందని తెలుస్తుంది. తను తెలుగులో హీరోయిన్గా చేస్తుందా, లేదా ప్రత్యేక పాత్రలు చేస్తుందా అనేది వేచి చూడాలి. నిజానికి జెనీలియా కంటే సీనియర్లైన త్రిష, నయనతార నేటికీ హీరోయిన్గా రాణిస్తున్నారు. వీరిలో నయన్ కూడా ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ.. ఇంకా భారీ క్రేజ్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో జనీలీయా అభిమానులు ఆమె కూడా హీరోయిన్ గానే చేస్తుంది.. సైడ్ క్యారెక్టర్ లో చేయడానికి ఆమెకేం తక్కువ అంటూ.. హాసిని రీ ఎంట్రీ ఎప్పుడు అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .