టాలీవుడ్ ఆడియన్స్‌కు ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో పలు సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా వ్యవహరించిన జానీ మాస్టర్ బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ షో కి కూడా జడ్జిగా వ్యవహరించి భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. అలాగే కామెడీ సీన్స్ తోనూ ఆకట్టుకున్నాడు. కాగా జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఇటీవల జరిగిన ఎలక్షన్స్ కి ముందే జనసేన పార్టీ కండువా వేసుకొని పవన్ కళ్యాణ్ కోసం జానీ మాస్టర్ ప్రచారం చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా జానీ మాస్టర్ కు సంబంధించిన ఓ న్యూస్ రల్ గా మారింది. తాజాగా ఆయన మీద పోలీసు కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్నాడు. ఈ టీంలో సతీష్ అనే డ్యాన్సర్ మెంబర్గా వ్యవహరిస్తున్నాడు.. ఇప్పుడు అతనే జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
నాలుగు నెలల నుంచి తనని షూటింగ్స్ కి పిలవడం లేదని.. తనకు పని చెబుతున్న కోఆర్డినేటర్ లను సైతం బెదిరిస్తున్నాడని.. దీంతో తన ఉపాధి లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేసులో ఇదే విషయాన్ని మెన్షన్ చేశాడు సతీష్. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పరిధి రాయదుర్గం పిఎస్ లో కేసు నమోదయింది. ఇందులో నిజా నిజాలు ఏంటో తెలియాలంటే జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యే వరకు వేచి చూడాలి.