బన్నీని అన్ ఫాలో చేసిన ఆ మెగా హీరో.. నిహారిక రియాక్షన్ ఇదే..?!

మెగా ఫ్యామిలీతో.. బన్నీ ఫ్యామిలీ గత కొద్దిరోజులుగా కలవడం లేదన్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్.. పవన్ పవన్ కళ్యాణ్ కు ప్రతిపక్ష పార్టీ అయినా వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడంతో ఇరు కుటుంబాల మధ్యన వివాదాలు మొదలయ్యాయి అంటూ వార్తలు నెటింట‌ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఎన్నికల బ‌రిలో సక్సెస్ సాధించడంతో ప్రమాణ స్వీకారం గ్రాండ్ లెవెల్ లో జరుపుకున్నారు.

Sai Dharam Tej Unfollows Allu Arjun And His Wife | cinejosh.com

ఇక ఈ ఈవెంట్‌కు మెగా ఫ్యామిలీ అంతా హాజరై సందడి చేశారు. ఈ క్రమంలో పవర్ స్టార్ ప్రమాణస్వీకారం తరువాత ఓ మెగా హీరో.. అల్లు అర్జున్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులందరికీ సోషల్ మీడియా వేదికపై అన్ ఫాలో చేసి నెటింట‌ వైరల్ గా మారాడు. ఈ నేప‌ద్యంలో తాజాగా ‘ కమిటీ కుర్రాళ్ళు ‘ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు మెగా డాటర్ నిహారిక హాజ‌రై సందడి చేసింది. ఈవెంట్లో భాగంగా నిహారికకు ఓ విలేఖరు ప్ర‌శ్న సందించాడు. ఓ మెగా హీరో.. అల్లు ఫ్యామిలీని అన్ ఫాలో చేశాడు కదా దానిపై మీ స్పంద‌న ఏంటి అని అడిగాడు.

Niharika Konidela's "Committee Kurrollu" Teaser Launch #niharikakonidela  #pawankalyan #varuntej - YouTube

ఆమె మాట్లాడుతూ ఆ విషయమే తనకు తెలియదని.. ఎవరి కారణాలు వారికి ఉంటాయి. దాన్ని మనం చెప్పలేమంటూ వివరించింది. ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమె చాలా తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకుంటుందంటూ.. ఆమె కుటుంబంలో జరుగుతున్న సంఘటనలు కూడా ఆమెకు తెలియకుండా ఉంటాయా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.