‘ దేవర ‘ సినిమా ప్రీ పోన్ అయితే ప్రొడ్యూసర్లకు అన్ని కోట్ల లాభమా.. ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..?!

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో దేవర సినిమా రూపొందుతున్న‌ సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 10న దసరా కానుకగా రిలీజ్ అవుతుందంటూ గతంలో మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా డేట్ ఫ్రీ ఫోన్ అయిందని.. సెప్టెంబర్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎట్టకేలకు ఈ ప్రచారం నిజం కావడం విశేషం. సోషల్ మీడియా వేదికగా దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజై వైరల్ గా మారింది.

జనతా గ్యారేజ్ తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబోలో వ‌స్తున్న‌ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే ఆర్‌ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుంచి రిలీజ్ అవుతున్న సోలో మూవీ కావడంతోపాటు.. శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తుండ‌టంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా ఈ క్రమంలో సినిమా ప్రి పోన్ కావడం వల్ల మేకర్స్‌కు ఏకంగా కోట్లలో లాభం వస్తుందని తెలుస్తుంది.

ఒకటి, రెండు కాదు మొత్తం రూ.50 కోట్ల వరకు లాభాల్లో ప్రొడ్యూసర్స్ ఉండనున్నారట. సినిమా సోలో రిలీజ్ కావడంతో అధిక‌ మొత్తంలో కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. విస్మరణకు గురైన సముద్రతీరా ప్రాంతానికి సంబంధించిన కథతో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతుండడం విశేషం.