టాలీవుడ్ నవ దళపతి సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా మూవీ హరోం హర. ఈ మూవీలో సునీల్ మాళవిక శర్మ, సునీల్, జయప్రకాష్, రవి కాలే, అర్జున్ గౌడ్, లక్కీ లక్ష్మి తదితరులు కీలక పాత్రలో నటించారు. ఇక నిన్న (జూన్ 14)న ఈ మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కుప్పం ప్రాంతంలో జరిగే మాఫియా దందా బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన ఈ సినిమాలో గన్ బిజినెస్ ప్రధానాంశంగా రూపొందింది. ఇందులో నటించే ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్.. అలాగే ప్రమోషన్ ఖర్చులు.. మొత్తం కలిపి సినిమాకు రూ.28 కోట్ల వరకు బడ్జెట్ అయిందని సమాచారం. ఇక రూ.12 కోట్లను గ్రాస్ వసుళ్ళుగా నిర్ణయించారు మేకర్స్.
ఈ నేపద్యంలో తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ రివ్యూస్ రావడంతో బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించింది. అయితే తాజాగా ఈ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉన్నాయో.. ఒకసారి తెలుసుకుందాం. ఇటీవల రిలీజైన హరోం హారా పెయిడ్ ప్రీమియర్లకు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. హైదరాబాద్‌లో రిలీజ్ అయిన అన్ని స్క్రీన్లు హౌస్ఫుల్ కలెక్షన్లను నమోదు చేశాయి. బుక్ మై షో లోను 93% రెస్పాన్స్ అందుకుంది. ఇక పేటీఎంలో 91% ఓటింగ్ పాజిటివ్గా జరగడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాను మొత్తంగా 600 స్క్రీన్ లలో రిలీజ్ చేయగా.. ఫస్ట్ షో తర్వాత మౌత్ టాక్‌కు మిక్స్డ్ టాప్ రావడంతో లేటుగా ఆక్యుపెన్సి జరిగింది. దీంతో ఓ మోస్తరు కలెక్షన్‌లు సినిమా రబట్టిందట. ఇక నిన్న ఈ సినిమాకు మొత్తంగా 40% ఆక్యుఫెన్సీ జరిగింది. అలా తెలుగు రాష్ట్రాల్లో రూ.50 లక్షలు కలెక్షన్లతో పాటు.. కోటి రూపాయల గ్రాస్ వసుళ్ళు జరిగాయని.. అలాగే మూవీకి ఓవర్సీస్ లో రూ.50 లక్షల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వివరించాయి. దీంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.1.5 కోట్ల గ్రాస్ వసుళను రాబడుతుందని చెబుతున్నారు.