ఇకనుంచి పాలిటిక్స్ పై సినిమాలు తీయను.. వాళ్ళ జోలికే పోను.. ఆర్జీవి షాకింగ్ కామెంట్స్..?!

టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు కేవలం టాలీవుడ్ లోనే కాకుండా.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరచుకొని సక్సెస్ఫుల్ సినిమాలతో రాణించాడు. అయితే గత కొంతకాలంగా దారుణమైన సినిమాలను తీస్తూ అట్టర్ ప్లాప్లను తన ఖాతాలో వేసుకుంటున‌ సంగతి తెలిసిందే. గతంలో ఏపీ రాజకీయాలపై ఎన్నో సినిమాలను తెర‌కెక్కించిన ఆర్జీవి.. ఇకనుంచి తాను పొలిటికల్ సినిమాల్లో జోలికి పోనంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆర్జీవి చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ అవుతున్నాయి. ఆర్జీవి నిన్న( జూన్ 14) హైదరాబాద్ లో యువర్ ఫిలిం కాంటెస్ట్ పేరుతో ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న యంగ్ టాలెంటెడ్ యూత్ కోసం ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.

yourfilm-announcement - RGV DEN

ఈ ఈవెంట్లో అతడు మీడియాతో ముచ్చటించాడు. ఏపీలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్న టైంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా కొన్ని సినిమాలను తీసిన ఆర్జీవి.. ఆ సినిమాలన్నింటిలోనూ వీరిద్దరి పాత్రలను చాలా దారుణంగా చూపించాడు. ఇప్పుడు ఇద్దరు ఏపీని పరిపాలించనున్నారు. మరి ఇప్పుడు ఆర్జీవి ఏం చేయబోతున్నాడు.. వాళ్లపై మరో విధంగా సినిమాలు తీస్తాడా అనే ప్రశ్నలు మీడియా సందించింది. దానికి ఆర్జీవి స్పందిస్తూ నాకు ఈ ప్రశ్న మీరు అడుగుతారని ముందే తెలుసు.. నేను ఇక రాజకీయాలపై సినిమాలు తీయదలుచుకోలేదు. ఇకనుంచి దేవుళ్లపై సినిమాలు తీస్తా అంటూ వివరించాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఒక‌సారిగా నవ్వారు. ఆర్జీవి గతంలో అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, లక్ష్మీస్ ఎన్టీఆర్, వ్యూహం లాంటి పొలిటికల్ సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలన్నీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా.. బాబుని ఓ విలన్ గా.. పవన్ కళ్యాణ్‌ను ఓ కమెడియన్ గా చూపిస్తూ తెర‌కెక్కించాడు. దీంతో టీడీపీ, జనసేన అభిమానులంతా ఆయనపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆర్జీవి రాజకీయాల జోలికి వెళ్ళేది లేదంటూ కామెంట్స్ చేయడం విశేషం. ఇక తానుచేపట్టిన యువ‌ర్ ఫిలిం గురించి మాట్లాడుతూ.. యంగ్ టాలెంటెడ్ యూత్ ను ప్రోత్సహించడమే తన లక్ష్యంగా ఈ కాంటెస్ట్ను పెట్టినట్లు వివరించాడు. ఈ ఈవెంట్లో పోటీకి సెలెక్ట్ అయినా షార్ట్ ఫిలిం మేకర్స్ తోపాటు, ఆర్జీవి డెన్ ప్రొడ్యూసర్ రవి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఈ కాంటెస్ట్‌కు ఎంపికలు రావడం విశేషం. ఇక ఈ కాంటెస్ట్ వివిధ ప్రాంతాల నుంచి మొత్తంగా 400 ఎంట్రీలు వచ్చాయని.. అయితే వాటి నుంచి 11 షార్ట్ ఫిలిమ్స్ ను షార్ట్ లిస్ట్‌గా ఎంపిక చేసామంటూ ఆయన చెప్పుకొచ్చాడు.