ప్రభాస్ కోసం రాసిన కథను కూడా విష్ణు కోసం ఇచ్చేశాడు.. కృష్ణంరాజు పై మోహన్ బాబు కామెంట్స్..?!

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప పై ప్రేక్షకులో భారీ అంచ‌నాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు పై సంయుక్తంగా మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్, మమ్ముట్టి, ప్రభాస్, కాజల్, నేహా శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, గ్లింప్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక గతంలో ఈ సినిమాలో శివుడి పాత్రల్లో ప్రభాస్ కనిపిస్తున్నాడంటూ వార్తలు తెరపైకి రావడంతో సినిమాపై మంచి అంచనాలు నెల‌కొన్నాయి. దీంతో ఇక సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూసారు. ఈ క్రమంలో నిన్న రిలీజ్ అయిన టీజర్ పై మరింత హైప్‌ పెరిగింది.

ఇందులో ప్రభాస్ ఐ షార్ట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా ఈ సినిమాలో శివుడు పాత్రలో ప్రభాస్ నటించడం లేదని అక్షయ్ కుమార్ ఆ పాత్రను నటించాడు అంటూ క్లారిటీ వచ్చేసింది. అయితే ప్రభాస్ కళ్ళను మాత్రమే చూపించి ఆయన రోల్ ఏమైఉంటుంద‌నే దానిపై సస్పెన్స్ క్రియేట్ చేశారు మేకర్స్. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు. ఇక తాజాగా జరిగిన ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో మోహన్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఏ తారానికైనా కన్నప్ప కొత్తగానే ఉంటుందని.. ధూర్జటి మహాకవి భక్తి భావం ఎలా రాశారు.. శ్రీకాళహస్తి మహత్యం.. గురించి ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది అంటూ ఆయన వివరించాడు.

ప్రభాస్‌ చేయాల్సిన `కన్నప్ప` మంచు విష్ణు వద్దకు ఎలా వెళ్లింది.. మోహన్‌బాబు,  కృష్ణంరాజు మధ్య ఏం జరిగింది?

ఇక ఇది కేవలం భక్తి చిత్రమే కాదని.. ఇందులో అన్ని రకాల అంశాలు ఉంటాయి అంటూ వివరించాడు. పరమేశ్వరుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తెరకెక్కుతుందంటూ చెప్పుకొచ్చాడు. ఇక సినిమా కోసం ముందుగా కృష్ణంరాజు గారితో నేను మాట్లాడానని.. విష్ణు కోసం కన్నప్ప తీయాలని అనుకుంటున్నాం అంటూ చెప్పినట్లు వివరించాడు. ప్రభాస్ కోసం రాసుకున్న కథను కూడా కృష్ణంరాజు గారు విష్ణు కోసం ఇచ్చేసారంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు కన్నప్పకు సంబంధించి ఇంకా ఎన్నో ఈవెంట్లు జరుగుతాయని.. అందరి ఆశీస్సులు ఈ సినిమాకు కావాలంటూ చెప్పుకొచ్చాడు మోహన్ బాబు. ప్రస్తుతం మోహన్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో ప్రభాస్ కోసం మొదట క‌న్నప్ప కథను కృష్ణంరాజు కూడా రాసుకున్నాడా.. అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.