మెగా బ్రదర్ నాగబాబు రుద్రవీణ సినిమాతో అంజనా ప్రొడక్షన్ బ్యానర్‌ను స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్గా మారిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయన ప్రతి సినిమాలో చిరంజీవి నటిస్తూ వచ్చాడు. అయితే 2010లో ఆయన చివరిగా ఆరెంజ్ సినిమా నిర్మించి భారీ అప్పుల్లో కూరుకుపోయి నిర్మాణరంగం నుంచి తప్పుకున్నాడు నాగబాబు. అంతకముందు చాలా సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన నాగబాబు.. ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి పూర్తి బాధ్యత తాను నమ్మిన మనుషులు, అలాగే తను సినిమాను పట్టించుకోకుండా వదిలేయడమే అంటూ వివరించాడు. అయితే ఈ సినిమాకు ముందు రామ్ చరణ్ మగధీరతో భారీ పాపులారిటి దక్కించుకున్నాడు. దానిని నాగబాబు వాడుకోలేకపోయాడు అంటూ అప్పట్లో వాదనలు వినిపించాయి.
ఏదేమైనా సినిమా అనుకున్న దాని కంటే బడ్జెట్ ఎక్కువగా మారడంతో సినిమాకు అప్పులు కూడా చేయాల్సి వచ్చింది. ఇక సినిమా ఫ్లాప్ అవడంతో సినిమా కోసం చేసిన అప్పులు తీరాలంటే తను మొత్తం ఆస్తిని అమ్మిన కూడా 10 శాతం అప్పులను కూడా తీర్చలేనని పరిస్థితికి నాగబాబుకు వెళ్ళిపోయాడట. ఆ సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకోవాలని భావించారట. అయితే అప్పటి వరకు నాగబాబు చేసిన అప్పుల గురించి కానీ.. ఆయన పడుతున్న ఇబ్బందుల గురించి కానీ ఎవరికీ చెప్పుకోలేదట. నాలుగు రోజుల తర్వాత చిరంజీవికి విషయం తెలియడంతో ఇంటికి నాగబాబుని పిలిపించి నేనున్నాను కదా ఏం టెన్షన్ పడకు అంటూ ధైర్యం చెప్పాడట. అలాగే వేరే దేశంలో షూటింగ్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ కు కూడా విషయం తెలియడంతో నాగబాబుకు ఫోన్ చేసి మరీ జరిగినవన్నీ మర్చిపో అన్నయ్య నేనున్నాను కదా చూసుకుంటా అంటూ వివరించాడట.
ఇలా వీరిద్దరూ చెప్పిన ధైర్యంతోనే మళ్లీ బ్రతుకుపై ఆశ పెరిగిందని చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి నాగబాబుకున్న అప్పులను మొత్తం తీర్చేసారని నాగబాబు చెప్పినట్లు తెలుస్తుంది. అప్పులు తీరిపోయాయి కానీ రేపటి కోసం డబ్బులు కావాలంటే మళ్లీ ఎవరిని అడగాలి అని సంకోచంలో పడిన నాగబాబును టీవీ ఆదుకుంది అంటూ వివరించాడు. జబర్దస్త్ తో పాటు పలు సీరియల్స్ లో కూడా అయిదారేళ్లపాటు మంచి అవకాశాలు రావడంతో నాగబాబుకు మంచి పాపులారిటీ దక్కింది. అయితే అప్పట్లో ఆరెంజ్ సినిమాకు రామ్ చరణ్ కు కేవలం 50% పేమెంట్ మాత్రమే చెల్లించాడట నాగబాబు. ఏదో ఒక రోజు మిగతా బాకీ ని కూడా తానే తీర్చేస్తానంటూ నాగబాబు వివరించాడు.