సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌నున్న ప‌వ‌ర్ స్టార్‌.. మెగా ఫ్యామిలీ క్లారిటీ ఇదే..?!

టాలీవుడ్ పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్.. గ‌త పది సంవత్సరాలుగా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ.. కష్టాలు, అవమానాలు ఎదుర్కొని ఎట్టకేలకు విజయభేరీ మోగించాడు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్.. మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసి ఫ్యాన్స్ ను ఫుల్ ఖుష్‌ చేశాడు. ఇక పవన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన క్రమంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ త్వరలోనే సినిమాలకు గుడ్ బై సినిమాల‌కు చెప్పనున్నారని.. రాజకీయాలకు పరిమితం కానున్నడంటూ వార్త‌లు వినిపించాయి.

Mega' daughter at the receiving end for bland styling of Chiru

డిప్యూటీ సీఎం గా ఎన్నికైన క్రమంలో గ్రామీణ అభివృద్ధి, అడవి, సైన్స్, రూరల్, వాటర్ లాంటి శాఖలకు మినిస్టర్‌గా వ్యవహరించ‌నున్నాడు. ఈ సమయంలో ఆయనకు సినిమాలు పై సమయం కేటాయించడం కుదరదని.. దీంతో రాష్ట్రం కోసం ప్రజల కోసం మంచి చేయాలని ఉద్దేశంతో సినిమాలకు గుడ్ బై చెప్పారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఇటీవల ఇదే ప్రశ్న మెగా డాటర్ సుస్మిత కొణిదలకు ఎదురయింది. ప్రస్తుతం పవర్ స్టార్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. సెట్స్ పై ఉన్న మూడు సినిమాలు ఎలాగూ పూర్తి చేయక తప్పదు. ఇక పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమాలకు సైన్ చేస్తారా.. లేదా సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటూ ఓ విలేక‌రు ప్రశ్నించగా.. దానికి సుస్మిత రియాక్ట్ అయింది. పవర్ స్టార్ సినిమాలకు బ్రేక్ ఇస్తారే తప్ప.. సినిమాలకు ఎప్పటికీ గుడ్ బై చెప్పరు అంటూ వివ‌రించింది.

Jana Sena chief Pawan Kalyan slams Andhra CM Chandrababu Naidu over  demonetisation - IBTimes India

ఆయన సినిమాలు ఆపేయడం అంటే.. అది ఫ్యాన్స్‌కు హార్డ్ బ్రేకింగ్ న్యూస్. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్న ఆయన రాజకీయాల నుంచి తప్పుకోకుండా శ్రమించి డిప్యూటీ సీఎం హోదాకు చేరాడు. ఇప్పుడు పవర్ స్టార్ విజయంతో ఆయన అభిమానులు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అలాగే ఏపీలో ఆయన చేసే మంచి పనులను చూసి తన అభిమానులు మరింత ఆనందపడాలి అంటూ ఆమె వివరించింది. ప్రస్తుతం సుస్మిత చేసిన కామెంట్స్ నటింట‌ వైరల్‌గా మారడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఒకింత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు పవర్ స్టార్ గుడ్ బై చెప్పేస్తారేమో అని సందేహంలో ఉన్నామని.. మీరిచ్చిన క్లారిటీతో చాలా హ్యాపీగా ఉందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.