చరణ్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఆ స్టార్ హీరోనే.. సుకుమార్ ఊర మాస్ ప్లానింగ్ వేరే లెవెల్..!

ఏ స్టార్ హీరో సినిమా హిట్ అయినా సరే ఆ హీరో పై స్పెషల్ ఫోకస్ పెడుతూ ఉంటారు డైరెక్టర్స్ . మరి ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న హీరోలతో సినిమా తెరకెక్కిస్తే ఒక్క దెబ్బతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకోవచ్చు . తాజాగా సోషల్ మీడియాలో సుకుమార్ పేరు మారుమ్రోగిపోతుంది . పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్న సుకుమార్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు .

ఈ సినిమా అయిపోయిన వెంటనే రాంచరణ్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . రంగస్థలం2 గా ఈ సినిమా రాబోతుంది అంటూ ప్రచారం జరిగిన ఇది మొత్తం రియల్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా అంటూ విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . రామ్ చరణ్ తో సినిమా అయిపోగానే డార్లింగ్ ప్రభాస్ తో సుకుమార్ ఒక క్రేజీ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నారట .

దీనికి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . కల్కి సినిమా చూసిన సుకుమార్ సినిమా సూపర్ డూపర్ గా ఉంది అంటూ ప్రభాస్ కి స్వయాన కాల్ చేసి విష్ చేయడమే కాకుండా వీళ్ళ మాటలు సందర్భంలో ఒక క్రేజీ ప్రాజెక్టుకు సైతం కమిట్ అయ్యారట. బ్యాక్ టు బ్యాక్ వరుసగా ప్లాన్ ఇండియా హీరోలతో సినిమాలకు కమిట్ అయిపోతున్నాడు సుకుమార్. అదే విధంగా సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అంటే హై రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు..!!