పడిపోయిన పుష్ప2 గ్రాఫ్ ను పెంచే ప్రయత్నం చేస్తున్న సుకుమార్.. ఏ విధంగా అంటే..?

మొన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో పుష్ప రేంజ్ ఎలా పెరిగిపోయిందో మనం చూసాం. అసలు ఇండస్ట్రీలో నెంబర్ వన్ గ్రాఫ్ రేంజ్ పుష్ప సినిమాకే ఉంది అన్న విధంగా మాట్లాడుకున్నారు జనాలు . చిన్న – పెద్ద – ముసలి వాళ్లు యంగ్ స్టార్స్ అందరూ కూడా పుష్ప గురించి మాటలు పాటలు ఆటలు అని చెప్పాలి . అయితే సడన్ గా బన్నీ చేసిన ఒకే ఒక్క పని పుష్ప రేంజ్ ను డౌన్ ఫాల్ చేసింది. వ్యక్తిగతంగా ఆయన తీసుకున్న నిర్ణయం సినిమా పరంగా ఆయనకు భారీ దెబ్బ వేసేసింది.

మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ దెబ్బకు ఏకంగా పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ కూడా పోస్ట్ పోన్ అయ్యింది . ఆగస్టు 15వ తేదీ రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఏకంగా డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్ పోన్ అయ్యింది . సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. సుకుమార్ పడిపోయిన పుష్ప2 గ్రాఫ్ ను పెంచేందుకు సరికొత్త విధంగా ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నారట . ఇన్నాళ్లు అప్డేట్స్ విషయంలో చాలా ఆలస్యం చేసిన సుకుమార్ ..

ఇకపై పది రోజులకి ఒక అప్డేట్ ఇచ్చే విధంగా సినిమాకి సంబంధించిన కొన్ని కొన్ని సీన్స్ పోస్టర్స్ రిలీజ్ చేయబోతున్నారట. అలా పుష్ప2 గ్రాఫ్ ను మళ్లీ జనాలలో పెంచడానికి ట్రై చేస్తున్నారట . సుకుమార్ తీసుకున్న డెసిషన్ మంచిదే కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది . చూద్దాం మరి సుకుమార్ డెసిషన్ పుష్ప2ను ఏ రేంజ్ లో సాటిస్ఫై చేస్తుందో..??