జాన్వీ పాప టూ స్పీడ్..ఆ విషయంలో ఎన్టీఆర్ నే మించిపోతుందిగా..!

జాన్వి కపూర్ .. ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు . బాలీవుడ్ ఇండస్ట్రీలో పక్కనపడితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఆమెకు హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ఇప్పటివరకు తెలుగులో ఆమె నటించిన ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు . కానీ చేతిలో ఏకంగా మూడు బడా ప్రాజెక్ట్స్ పట్టుకుని ఉంది. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా ద్వారా డెబ్యూ ఇస్తున్న జాన్వి కపూర్ ఆ తర్వాత రామ్ చరణ్ తో ఒక సినిమాకి కమిట్ అయింది . అంతేకాకుండా విజయ్ దేవరకొండ సరసన కూడా అమ్మడు ఒక సినిమాలో నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

అంతేనా రాజమౌళి మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాలోని ఒక పాత్రలో కనిపించబోతుంది జాన్వి కపూర్ అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ప్రజెంట్ జాన్వీ కపూర్ – ఎన్టీఆర్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉంది . థాయిలాండ్ లో ఈ సినిమాకి సంబంధించిన థర్డ్ షెడ్యూల్ జరుగుతుంది . కాగా ఈ షెడ్యూల్లో ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తున్నారట. ఈ సాంగ్ షూట్లో జాన్వి కపూర్ ఎన్టీఆర్ ని మించిపోయే రేంజ్ లో స్టెప్స్ వేసేస్తుందట .

కేవలం సింగిల్ టేక్ లోనే నాటి నాటి స్టెప్స్ వేస్తూ అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంటుందట . సాధారణంగా ఎన్టీఆర్ ని మించిపోయే స్టెప్స్ వేయాలి అంటే చాలా కష్టం. కానీ జాన్వి కపూర్ మాత్రం రొమాంటిక్ స్టెప్స్ ని కూడా చాలా అవలీలగా వేసేస్తుందట . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. కొందరు జాన్వి కపూర్ ని బాలీవుడ్ బ్యూటీ అని పొగిడేస్తుంటే .. మరికొందరు ఆమె బ్లడ్ శ్రీదేవిది.. ఒకప్పుడు ఆమె ఎంతలా హైపర్ ఆక్టివ్ గా ఉండిందో అంతకు రేంజ్ లో ఎప్పుడు జాన్వీ కపూర్ అల్లాడించేస్తుంది అని పొగిడేస్తున్నారు..!!