చాలా కాలం తరువాత తెలుగు సినిమాలో నటించబోతున్న భూమిక.. ఆ హీరో ఎవరంటే..?

భూమిక.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ ..తన అంద చందాలతో కుర్రాళ్లను నిద్ర పట్టనికుండా గిలిగింతలు పెట్టేసి న హాట్ బ్యూటీ . భూమిక నటించే సినిమాలు ఎంత ఆనందంగా ..ఆహ్లాదకరంగా నాటీగా ఉంటాయో తెలిసిందే. కేవలం ట్రెడిషనల్ పాత్రలో మాత్రమే భూమిక నటించిందా..? అంటే నో అని చెప్పాలి . అయితే హద్దులు మీరీన పాత్రల్లో కనిపించిందా..? అంటే అది కూడా నో అనే చెప్పాలి .

 

తన లిమిట్స్ లో తాను ఉంటూ జనాలను బాగా ఎంటర్టైన్ చేసింది . ఆ తర్వాత సీనియర్ రేంజ్ లో ఆమె పలు సినిమాలలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కూడా నటించి మెప్పించింది. కాగా ఇప్పుడు రీసెంట్ గా హీరోయిన్ భూమికకు సంబంధించిన ఒక మేటర్ నెట్టింట వైరల్ గా మారింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించిన భూమిక చాలాకాలం తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఒక సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న బాలయ్య బోయపాటి కాంబోలో అమ్మడు ఒక ఇంపార్టెంట్ పాత్ర చేయబోతుందట . మనకు తెలిసిందే రీసెంట్గా బాలయ్య బర్త్డ డే సందర్భంగా బీబీ 4 అనే హ్యాష్ ట్యాగ్ తో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు బోయపాటి . ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రాబోతుందట . అయితే ఈ సినిమాలో కీలకపాత్రలో భూమిక కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!