సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు కల్కి. డైరెక్టర్ నాగ్ అశ్వీన్.. కెరియర్ ఓ రేంజ్ లో మలుపు తిప్పబోతున్న సినిమా ఇదే అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . బాహుబలి సినిమా కోసం ఎంతలా కష్టపడ్డారో.. అంతకు ట్రిపుల్ స్థాయిలో ఈ సినిమా హిట్ అవ్వడానికి కష్టపడుతున్నారు కల్కి టీం. కేవలం కంటెంట్ ని నమ్ముకుని ముందుకు వెళ్తున్న కల్కి టీం.. సినిమా ప్రమోషన్స్ ని కూడా బాగా నిర్వహిస్తున్నారు.
కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో కల్కి సినిమాకి సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి ఇంట్రెస్టింగ్ చర్చలు మొదలయ్యాయి. కల్కి సినిమా మొదటిరోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటూ అంచనా వేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్ . కాగా కల్కి సినిమా దాదాపు 90 కోట్లకు పైగానే మొదటి రోజు కలెక్షన్స్ సాధిస్తుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఇప్పటివరకు జరిగిన బిజినెస్ ప్రకారం బుక్ అయిన టికెట్స్ ప్రకారం 90 కోట్లు కాదు ఏకంగా మొదటి రోజు 100 కోట్లు కలెక్షన్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు ఫ్యాన్స్.
అదే జరిగితే మాత్రం సినీ చరిత్రలో ఇది ఒక బిగ్ హిస్టరీగా మారిపోతుంది. ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇలాంటి క్రేజీ రికార్డ్స్ కలెక్షన్స్ సాధించింది లేదు . చూద్దాం మరి ప్రభాస్ ఫ్యాన్స్ అనుకున్న విధంగా కలిగి సినిమా మొదటిరోజు 100 కోట్లు కలెక్ట్ చేస్తుందో లేదో..? మొత్తానికి ప్రభాస్ ఏదో మాయ చేసేలానే ఉన్నాడు..చరిత్ర సృహ్స్టించేలా నే ఉన్నాడు ..అంటూ మాట్లాడుకుంటున్నారు..!!