సినిమాల విషయంలో రామ్ చరణ్ సంచలన నిర్ణయం.. మెగా ఫ్యాన్స్ కు ఊహించని షాక్..!

సినిమాల విషయంలో రామ్ చరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడ..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. ఒక నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ . ఫాదర్స్ డే సందర్భంగా ఆ ఇంటర్వ్యూ ని రిలీజ్ చేశారు. ఆ ఇంటర్వ్యూలో రాంచరణ్ ఎక్కువగా క్లీం కారా గురించే మాట్లాడడం.. చర్చించడం.. ఆమెకు సంబంధించిన ఫోటోలు రివిల్ చేయడం సంచలనంగా మారింది .కాకగా క్లింకారాతో ఆయన గడిపే మూమెంట్స్ గురించి చెప్తూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు రామ్ చరణ్.

ఈ క్రమంలోనే క్లింకారాలతో ఉన్న బాండింగ్ గురించి బయటపెట్టాడు . ఇంట్లో ఎంతమంది తనతో ఆడుకుంటూ ఉన్నా .. నేను వస్తే మాత్రం చాలా చాలా నవ్వుతుందని .. నేనంటే నా కూతురికి చాలా ఇష్టమని చెప్పుకు వచ్చాడు . అంతేకాదు ఫుడ్ పెట్టడానికి క్లింకారకు అందరూ ఇబ్బందులు పడతారు అని .. కానీ నేను పెడితే మాత్రం ఫుల్ గా తినేస్తుంది అంటూ కూడా సీక్రేట్ ని బయట పెట్టాడు. ఎక్కడ ఉన్న సరే ఆరు గమటల్లకి ఇంటికి వెళ్లిపోతాను అని.. నా టైమింగ్ మొత్తం మార్చేసుకున్నాను అని చెప్పుకొచ్చాడూ.

క్ల్మీ కారాతో గడిపే ప్రతి క్షణం నాకు చాలా చాలా వాల్యుబుల్ అని .. తను స్కూల్ కి వెళ్లే లోపు ఎంత టైం కుదిరితే అంత టైం తనతో గడపాలి అని.. అందుకే ఈ మధ్యకాలంలో సినిమాలను కూడా నేను నెమ్మదిగా ఓకే చేస్తున్నాను అని .. ఇకపై కూడా సినిమాల విషయంలో అలాగే నిర్ణయం తీసుకుంటాను అని.. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం క్లీం కారాకే అంటూ చెప్పుకొచ్చాడు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!