వార్నీ.. బన్నీ జనసేనకు సపోర్ట్ చేయకపోవడానికి కారణం అదేనా..? ఫైనల్లీ బయటపడ్డ నిజం..!

ఇన్నాళ్లు బన్నీ ఎందుకు జనసేనకు సపోర్ట్ చేయలేదా..? ఎందుకు బన్నీ తన కెరీర్ని చిక్కుల్లో పడేసుకున్నాడా..? అంటూ అంతా మాట్లాడుకున్నారు. ఫైనల్లీ ఇప్పుడు బన్నీకి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పోపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ..వైసీపీ క్యాండిడేట్ శిల్పా రవికి ఎన్నికల్లో సపోర్ట్ చేశాడు. దీనితో జనసైనికులు అల్లు అర్జున్ పై ఫుల్ మండిపడ్డారు ..మెగా ఫాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు .

అయితే ఎందుకు జనసేనకి సపోర్ట్ చేయకుండా..? వైసిపికి సపోర్ట్ చేశాడు అన్న విషయంపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. బన్నీ వాసు కు టికెట్ ఇవ్వమంటూ అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ ను చాలా సార్లు రిక్వెస్ట్ చేశారట . అయితే పవన్ కళ్యాణ్ ఆయనకు టికెట్ ఇవ్వలేదట .. ఈ క్రమంలోనే హర్ట్ అయిన అల్లు ఫ్యామిలీ జనసేనకు దూరంగా ఉండిందట . ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింత బాగా ట్రెండ్ అవుతుంది. ఈ వార్తలో ఎంత నిజం ఉంది అని తెలియనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది . దీంతో బన్నీ ఫాన్స్ మెగా ఫ్యాన్స్ మధ్య వార్ మరింత పిక్స్ కి చేరుకుంది.

అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న పుష్ప2 సినిమా సైతం వాయిదా పడినట్లు తెలుస్తుంది. అది మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ కారణంగానా..? లేకపోతే సుకుమార్ కొన్ని సీన్స్ రీ షూట్ చేసే మూమెంట్లో ఆలస్యం అవుతుంది అని భావించిన కారణంగానా..? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి పుష్ప2 విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది..!!