వామ్మో.. రష్మిక ఈ రేంజ్ లో డిమాండ్ చేస్తుందా..? ఆ సినిమా కోసం అన్ని కోట్లు తీసుకుంటుందా..?

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ స్టార్ హీరోలకి మించిన రేంజ్ లో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది కోట్లు – 10 కోట్లు – 12 కోట్లు కూడా తీసుకుంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్స్ మూడు కోట్లకు పైగా పుచ్చుకుంటేనే అది ఒక పెద్ద సెన్సేషన్ . కాగా తాజాగా సోషల్ మీడియాలో హీరోయిన్ రష్మిక మందన్నాకు సంబంధించిన ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్నా..

మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది . ఈ సినిమా కోసం చాలానే కష్టపడుతుంది . అయితే ఈ సినిమా కోసం రష్మిక మందన్నా..కెరియర్ లోనే ఫస్ట్ టైం 15 కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుందట . ఇప్పటివరకు ఏ బ్యూటీ కూడా ఇంత హై రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోలేదు . అయితే మేకర్స్ కూడా ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట . దీంతో ఇదే న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది.


రష్మిక మందన్నా.. ఖాతాలో బోలెడన్ని సినిమాలు ఉన్నాయి. తెలుగులో ఆల్రెడీ మూడు సినిమాలు చేస్తుంది. అది కాకుండా రెండు సినిమాలు హోల్డ్ లో పెట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . బాలీవుడ్ లో అయితే ఏకంగా ఆరు సినిమాలకు సైన్ చేసింది . మొత్తంగా టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. అమ్మడు స్పీడ్ చూస్తుంటే మరో ఐదేళ్లు ఆమె టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది ఏమో..??