రాజమౌళి రిక్వెస్ట్ చేసిన ఆయన ఆఫర్ నే.. రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

సాధారణంగా కొందరి హీరోయిన్స్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే అస్సలు ఆలోచించరు.. క్యారెక్టర్ ఎలాంటిదైనా సరే పరుగు పరుగున వెళ్లి కాల్ షీట్స్ ఇచ్చేసి వస్తారు. ఆయనపై అంత నమ్మకం .. చాలా తక్కువ మంది మాత్రమే రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేస్తారు. మరి ముఖ్యంగా ఆయన స్టేటస్ తెలిసిన ఎవ్వరు కూడా సౌత్ – నార్త్ బ్యూటీస్ అస్సలు ఆయన సినిమాని రిజెక్ట్ చేయరు. అయితే ఆయన గురించి తెలిసి ఆయన స్టార్ హీరోయిన్ ఆయన మూవీ ని రిజెక్ట్ చేసిందట.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల్లో ఆఫర్స్ రిజెక్ట్ చేసిందట. దీనితో ఆ హీరోయిన్ పేరు నెట్టింట మారు మ్రోగిపోతుంది. ఆ బ్యూటీ మరెవరో కాదు త్రిష . చెన్నై బ్యూటీగా బాగా పాపులారిటీ సంపాదించుకున్న త్రిష రాజమౌళి సినిమాను మూడు సార్లు రిజెక్ట్ చేసిందట . ఈ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. రీజన్ ఏంటో తెలియదు కానీ రాజమౌళి త్రిషతో కొన్ని సినిమాలను తెరకెక్కించాలి అని బాగా ఇష్టపడ్డారట .

ఆమెలోని నటన యాంగిల్స్ ఆయనకు అంత నచ్చేసాయో.. ఏమో..? అయితే త్రిష మాత్రం వరుసగా మూడుసార్లు రాజమౌళి ఆఫర్ ని రిజెక్ట్ చేసింది అట. ఒకసారి రిజెక్ట్ చేస్తే రాజమౌళి మరోసారి ఆ హీరోయిన్ దగ్గరికి వెళ్ళడు . అలాంటిది రెండు సార్లు రిజెక్ట్ చేసిన కూడా మూడోసారి త్రిష వద్దకు ఆఫర్ తీసుకెళ్లాడు అంటే ఏదో బిగ్ రీజనే ఉంది. అయితే త్రిష మాత్రం ఏ రేంజ్ లో తగ్గలేదు సూపర్ డూపర్ హిట్ అవుతాయి అని తెలిసిన కూడా ఆ సినిమాలను రిజెక్ట్ చేసిందట. అసలు కారణమేంటో ఆ దేవుడికి త్రిషకి మాత్రమే తెలియాలి..??