“మెగా కోడలు దానికి మాత్రమే పనికి వస్తుందా..?”.. ఫ్యాన్స్ అంత మాట అనేసారు ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్ కేవలం ట్రెడిషనల్ రోల్స్కి మాత్రమే సెలెక్ట్ అవుతారు . ఆ లుక్స్ లో వాళ్ళు బాగుంటారు.. మరి కొందరు కేవలం ట్రెండీ.. హాట్ రోల్స్ వారకే బాగుంటారు . అయితే తాజాగా లావణ్య త్రిపాఠి ఫాన్స్ ఆమె రొమాంటిక్ సీన్స్ కి అస్సలు సెట్ అవ్వదు అని హోంలీ .. ట్రెడిషనల్ లుక్స్ కి మాత్రమే సెట్ అవుతుంది అని బాగా ట్రెండ్ చేస్తున్నారు . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం.

మరీ ముఖ్యంగా వరుణ్ తేజ్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను హీరోయిన్ గా కన్నా కూడా మెగా ఇంటి కోడలు గానే.. ఎక్కువగా లైక్ చేస్తున్నారు జనాలు . అయితే పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న లావణ్య త్రిపాఠి ఎన్ని ఆఫర్స్ వస్తున్నా సరే వాటిని రిజెక్ట్ చేస్తుందట . పెళ్లి తర్వాత మిస్ పర్ఫెక్ట్ అనే సిరీస్ మాత్రమే నటించింది. ఆ తర్వాత బోలెడన్ని అవకాశాలు వచ్చిన రిజెక్ట్ చేస్తూ వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి ఫాన్స్ రియాక్ట్ అవుతున్నారు .

సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉంటే లావణ్య త్రిపాఠి నటించదు అని ..పెళ్లికి ముందు కూడా ఆమె చాలా తక్కువ సందర్భాలలోనే అలాంటి సీన్స్ ఉన్న మూవీస్ చూస్ చేసుకుంది అని .. అసలు లావణ్య త్రిపాఠి కి ట్రెడిషనల్ పాత్రలు తప్పిస్తే హస్కీ – రొమాంటిక్ – నాటి లుక్స్ ఉన్న సినిమాలు సెట్ అవ్వవు అని చెప్పుకొస్తున్నారు . దీనినే కొంతమంది వ్యంగ్యంగా లావణ్య త్రిపాఠి కేవలం ట్రెడిషనల్ పాత్రలకు మాత్రమే పనికొస్తుంది అంటూ ఘాటుగా కూడా కౌంటర్స్ వేస్తున్నారు..!!