సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూట్ లకి తన పిల్లలను తీసుకెళ్లడు . కారణమేంటో తెలియదు కానీ ఇప్పటివరకు తారక్ చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే తాను హీరోగా వర్క్ చేస్తున్న సినిమా షూటింగ్స్ కు లక్ష్మీ ప్రణతిని అదే విధంగా తన పిల్లలు భార్గవ్ రామ్..అభయ్ లను తీసుకెళ్తూ ఉంటాడు . అయితే చాలాకాలం తర్వాత మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ తన పిల్లలని తన వర్క్ చేసే సినిమా షూటింగ్స్ స్పాట్ కు తీసుకెళ్తున్నాడు . దానికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి .
జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుంది . ఈ సినిమా కొత్త షెడ్యూల్ థాయిలాండ్ లో జరగబోతుంది . కాగా ఈ క్రమంలోనే ఫ్యామిలీతో వెకేషన్ ని కూడా ఎంజాయ్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ .. లక్ష్మీ ప్రణతితో పాటు అభయ్ రామ్ – భార్గవ్ లను కూడా తనతో పాటు థాయిలాండ్ తీసుకెళ్తున్నాడు . దీనికి సంబంధించిన ఎయిర్పోర్ట్ లోని పిక్చర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అభయ్ రామ్ – భార్గవ్ రామ్ చాలా పెద్ద వాళ్ళు అయిపోయారు . ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి..
దేవర సినిమాతో పాటు జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాను కూడా సెట్స్ కి తీసుకొచ్చాడు . ఈ రెండు సినిమాలు కంప్లీట్ అవ్వగానే ఆగస్టు నెలలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో దుమ్ము దులిపేస్తున్నాడు..!