అంజలి కోసం అలాంటి పని చేయబోతున్న బాలయ్య..జనాలకు కొత్త డౌట్లు స్టార్ట్..!?

నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో అంజలి – బాలయ్య పేర్లు ఎలాంటి విధంగా ట్రోలింగ్కి గురయ్యాయో మనం చూస్తూనే ఉన్నాం . విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య .. అంజలిని తోసేసాడు అని ఆమెపై కొంచెం నాటిగా ప్రవర్తించాడు అని రకరకాల వీడియో సోషల్ మీడియాలో మారు మ్రోగిపోయాయి. అసలు బాలయ్య స్థాయి లేని వాళ్ళు కూడా ఆయనను వెటకారంగా మాట్లాడడం మనం చూసాం . కొంతమంది ఆయనను హద్దులు మీరిపోయి మరి కామెంట్స్ చేశారు . అయినా సరే బాలయ్య ఎక్కడా కూడా ఏమి టంగ్ స్లిప్ అవ్వలేదు ..ఏమీ మాట్లాడలేదు .

కానీ చాలామంది మాత్రం బాలయ్యకు సపోర్ట్ చేశారు . డైరెక్టర్ లు..ప్రొడ్యూసర్స్.. హీరోస్ బాలయ్య అలాంటి వ్యక్తి కాదు అని అది సరదాగా చేసిన పని అంటూ సపోర్ట్ చేశారు. హీరోయిన్ అంజలి సైతం మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే ఇది జరిగింది అని తప్పుగా తీసుకోవద్దు అంటూ కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేసింది. అయితే పని పాట లేని ఆకతాయలు మాత్రం బాలయ్యను బాగానే ట్రోల్ చేశారు. ఫైనల్లీ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత బాలయ్య హిందూపురం నియోజకవర్గం నుంచి మూడోసారి గెలిచిన తర్వాత అందరూ నోరు మూసేసుకున్నారు .

ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది . బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమాలో హీరోయిన్ అంజలి స్పెషల్ ఐటమ్ సాంగ్ చేయబోతుందట . దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. సాధారణంగా ఇలాంటి కాంబో సెట్ అయి ఉంటే జనాలు పెద్దగా మాట్లాడుకునే వాళ్ళు కాదు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంత తతంగం జరిగిన తర్వాత వెంటనే బాబీ దర్శకత్వంలో ఐటమ్ సాంగ్ కోసం అంజలిని చూస్ చేసుకోవడం పెద్ద సంచలనంగా మారింది. బాలయ్య చెప్తేనే బాబి ఇలా చేశాడా ..? లేక ఇది ఆల్రెడీ ముందుగానే సెట్ అయిన కాంబో నా..? అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట మారు మ్రోగిపోయింది..!!