ఓరి నీ దుంప తెగ.. బిడ్డతో ఈ స్టంట్స్ ఏంట్రా బాబు.. నయన్ భర్త ఏం చేశాడో చూడండి..!

ప్రజెంట్ సోషల్ మీడియాలో కొందరు జనాలు నయనతార భర్త విగ్నేశ్ శివన్ ని ఏకిపారేస్తున్నారు . దానికి కారణం తాజాగా ఆయన షేర్ చేసిన ఫొటోస్ . తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ నయనతార భర్త విగ్నేష్ శివన్ తన బిడ్డలతో దిగిన కొన్ని ఫొటోస్ తీసుకున్న ఫొటోస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి .. అదేవిధంగా ట్రోలింగ్ కి కూడా గురవుతున్నాయి . బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ బిడ్డని చేత్తో ఎత్తుకొని ఉండే స్టిల్ బాగా హాట్ టాపిక్ గా వైరల్ అయింది .

అప్పట్లో ఈ స్టిల్ ని చాలామంది రీ క్రియేట్ చేయడానికి చూశారు . పలువురు జనాలు తిట్లు కూడా తిట్టారు . అది మొత్తం గ్రాఫిక్స్ లో చేసింది అని .. మీరు ఒరిజినల్ బిడ్డను పెట్టుకొని ఇలా చేస్తే బిడ్డ పడిపోతే ఎవడు దిక్కు అని ..చాలా రేంజ్ లో.. టిక్ టాక్ వీడియోస్ పై యూట్యూబ్ షాట్స్ పై మండిపడ్డారు. అయితే ఇప్పుడు అదే విధంగా విగ్నేష్ శివన్ కూడా చేశారు. తన ఇద్దరు కొడుకులు నదిలో బాహుబలి సీన్ ను రీ క్రియేట్ చేశారు .

నదిలో ఆయన మునుగుతూ రెండు చేతులు పైకెత్తి బిడ్డను చేతిలో పట్టుకొని ఫొటోస్ తీసుకున్నాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొందరు వావ్ సూపర్ అంటుంటే.. మరికొందరు బుద్ధుందా బిడ్డ చేయి జారిపోతే ఊరికే వస్తాడా ..? అంటూ మండిపడుతున్నారు. మరికొందరు సరోగసి బిడ్డ కదా అంటూ వ్యంగ్యంగా వెటకారంగా ట్రోల్ చేస్తున్నారు . మొత్తానికి విగ్నేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ ఇప్పుడు ఆయనపై నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యేలా చేశాయి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)